
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ వర్గాల సంక్షేమం, వారి జీవనోపాధి అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకాన్ని అర్హులైన బీసీ వర్గాల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ పథకం ద్వారా రజకులు, స్వర్ణకారులు, నాయీ బ్రాహ్మణులు, అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందిన అర్హులైన కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందుతుందని ఆయన పేర్కొన్నారు.
వృత్తుల వారీగా ఉచిత విద్యుత్ వివరాలు
దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు
జిల్లాలోని అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. అర్హత గల వారు ఈ క్రింది పత్రాలతో సంబంధిత APSPDCL అసిస్టెంట్ ఇంజనీర్ (AE) కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అత్యంత వెనుకబడిన వర్గాల పరిధిలోకి వచ్చే దాసరి, దొమ్మర, జంగం, జోగి, దమ్మలి, ముత్యాలమ్మవాండ్లు మొదలైన 32 ఉప కులాలకు చెందిన లబ్ధిదారులకు ఎలాంటి ఎస్టాబ్లిష్‌మెంట్ సర్టిఫికేట్ అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం కల్పించిన ఈ గొప్ప అవకాశాన్ని జిల్లాలోని అర్హులైన వృత్తిదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.