Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ నిధులు మీ అకౌంట్లో పడ్డాయా..? లేదా? ఆధార్ నెంబర్‌తో ఇలా తెలుసుకోండి..

ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే రైతుల అకౌంట్లలో ఇవి జమ అయ్యాయి. మీకు పడకపోతే ఫిర్యాదు చేసి సమస్య పరిష్కరించుకోవచ్చు. దీని కంటే ముందు మీ అకౌంట్లో పడ్డాయా.. లేదా అనే స్టేటక్ చెక్ చేసుకోవాలి.

Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ నిధులు మీ అకౌంట్లో పడ్డాయా..? లేదా? ఆధార్ నెంబర్‌తో ఇలా తెలుసుకోండి..
Annadata Sukhibhava

Updated on: Nov 01, 2026 | 9:42 AM

ఏపీలోని రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. దీపావళి పండగ సందర్భంగా అన్నదాత సుఖీభవ నిధులు విడదుల చేసింది. అక్టోబర్ 30వ తేదీన వీటిని విడుదల చేయగా.. రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఒకేసారి రైతుల అకౌంట్లలో రూ.7 వేలు పడుతున్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.5 వేలు ఉండగా.. పీఎం కిసాన్ కింద కేంద్ర వాటా రూ.2 వేలుగా ఉంది. మొత్తం 46.85 లక్షల మంది రైతులకు రూ.2234.03 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ నిధులు ముందుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి బ్యాంకులకు అందుతాయి. అనంతరం బ్యాంకులు రైతుల ఖాతాల్లో జమ చేస్తాయి. దీంతో కొంతమందికి నిధులు అందుకోవడంలో జాప్యం జరగవచ్చు. అయితే మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా.. లేదా అనేది సులువుగా తెలుసుకోవచ్చు.

అన్నదాత సుఖీభవ నిధులు చెక్ చేసుకోవడం ఎలా..?

-ఏపీ ప్రభుత్వ అన్నదాత సుఖీభవ పోర్టల్ https://annadathasukhibhava.ap.gov.in/ తెరవాలి

-హోమ్ పేజీలో కనిపించే నో యువర్ స్టేటస్ ఆప్షన్ ఎంచుకోవాలి

-అనంతరం ఆధార్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్‌ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి

-ఆర్దిక సంవత్సరం సెలక్ట్ చేసుకోవాలి

-ఆ తర్వాత మీకు తాజా విడత డబ్బులు జమ అయ్యాయా.. లేదా అనేది తెలుస్తుంది

అన్నదాత సుఖీభవ సొమ్ము అకౌంట్లో పడలేదా..?

అన్నదాత సుఖీభవ సొమ్ము మీ అకౌంట్లో పడకపోతే ఆందోళన చెందవద్దు. మీ బ్యాంక్ స్టేట్ మెంట్ చెక్ చేసుకోండి. అయినా డబ్బులు పడినట్లు చూపించకపోతే బ్యాంక్ కేవైసీ సమస్య ఏమైనా ఉందేమో చేసుకోండి. బ్యాంక్ కేవైసీ పెండింగ్‌లో ఉంటే డబ్బులు నిలిచిపోతాయి. దీంతో వెంటనే బ్యాంక్‌కు వెళ్లి కేవైసీ ప్రక్రియ పూర్తి చేస్తే మీ డబ్బులు జమ అవుతాయి. ఇక బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ లింక్ చేయకపోయినా, ఎన్‌పీసీఐ మ్యాపింగ్ కాకపోయినా డీబీటీ ప్రక్రియ ద్వారా నిధులు జమకావు.  ఇక మీ మండల కేంద్రంలోని రైతు భరోసా కేంద్రాలను సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చు. అలాగే గ్రామ, వార్డు సచివాలయంలోకి వెళ్లి అయినా కంప్లైంట్ చేయవచ్చు. వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేయడం ద్వారా ఎందుకు అందలేదనే విషయం తెలుస్తుంది. ల్యాండ్ రికార్డుల్లో తప్పులు ఉన్నా లేదా ఇతర ఏవైనా కారణాలు ఉంటే వాటిని పరిష్కరించుకోవాలి. తద్వారా మీరు నిధులు పొందే అవకాశముంటుంది. కాగా అన్నదాత సుఖీభవ పథకం కింద ఏపీ ప్రభుత్వం ప్రతీ ఏడాది రూ.20 వేలు సాయం అందిస్తోంది. వీటిల్లో కేంద్ర వాటా రూ.6 వేలుగా ఉంది.

 

Loading...
Unable to load recommendations.
Follow Us