YCP vs TDP: బస్తీమే సవాల్‌.. హిందూపురంలో వైసీసీ వర్సెస్‌ టీడీపీ.. పోటాపోటీ ప్రెస్‌మీట్లతో పొలిటికల్ హీట్

అటు వైసీపీ, ఇటు టీడీపీ.. హిందూపురం సెంటర్‌లో బస్తీమే సవాల్‌ అంటూ డైరెక్ట్‌ ఫైట్‌కి దిగాయి. ఎవరి హయాంలో హిందూపురం అభివృద్ధి జరిగిందో తేల్చుకుందాం రా అంటూ ఇరువర్గాలు రోడ్డుపైకి రావడంతో హిందూపురం.. ఎన్నడూ లేనంతగా హీటెక్కిపోయింది.

YCP vs TDP: బస్తీమే సవాల్‌.. హిందూపురంలో వైసీసీ వర్సెస్‌ టీడీపీ.. పోటాపోటీ ప్రెస్‌మీట్లతో పొలిటికల్ హీట్
Ycp Vs Tdp
Follow us

|

Updated on: Sep 29, 2022 | 7:34 AM

అధికార వైసీపీ-ప్రతిపక్ష టీడీపీ డైరెక్ట్‌ ఫైట్‌తో ఉమ్మడి అనంతపురం జిల్లా హీటెక్కిపోతోంది. ఇన్నాళ్లూ తాడిపత్రి, ధర్మవరం, రాప్తాడులో మాత్రమే కనిపించిన పొలిటికల్‌ హీట్‌, ఇప్పుడు హిందూపురంలోనూ చెలరేగింది. అటు వైసీపీ, ఇటు టీడీపీ.. హిందూపురం సెంటర్‌లో బస్తీమే సవాల్‌ అంటూ డైరెక్ట్‌ ఫైట్‌కి దిగాయి. ఎవరి హయాంలో హిందూపురం అభివృద్ధి జరిగిందో తేల్చుకుందాం రా అంటూ ఇరువర్గాలు రోడ్డుపైకి రావడంతో హిందూపురం.. ఎన్నడూ లేనంతగా హీటెక్కిపోయింది. ఒకేచోట వైసీపీ, టీడీపీ నేతలు పోటాపోటీ ప్రెస్‌మీట్లకు ప్రయత్నించడంతో అట్టుడికిపోయింది. మరోవైపు, ఎమ్మెల్యే బాలకృష్ణ కనిపించడం లేదంటూ పోలీస్‌ స్టేషన్‌లో కంప్లైంట్‌ ఇచ్చారు. తమ ఎమ్మెల్యే కనిపించడం లేదని, వెతికి పట్టుకోవాలంటూ వన్‌టౌన్‌ పీఎస్‌లో ఫిర్యాదుచేశారు

పోటాపోటీగా ప్రెస్‌మీట్లు..

హిందూపురం ప్రెస్‌క్లబ్‌ దగ్గర వైసీపీ, టీడీపీ శ్రేణులు బాహాబాహీకి దిగడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఇరువర్గాలను కంట్రోల్‌ చేయడానికి నానా తిప్పలు పడ్డారు పోలీసులు. ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ప్రెస్‌ క్లబ్‌లో టీడీపీ శ్రేణులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. విలేకరుల సమావేశం అనంతరం టీడీపీ శ్రేణులు బయటకు వెళ్లే సమయంలో వైసీపీ శ్రేణులు మూకుమ్మడిగా వచ్చి టీడీపీ నాయకులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ విషయం తెలుసుకున్న వన్‌టౌన్‌ సీఐ ఇస్మాయిల్‌ ఇరువర్గాల వారికి నచ్చజెప్పి పంపివేశారు. అనంతరం వైసీపీ నేతలను వెంటనే అరెస్టు చేయాలంటూ టీడీపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..