UNO AWARD to AP: రైతు భరోసా కేంద్రాలకు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు.. ఆర్బీకేలను వరించిన ఛాంపియన్‌ అవార్డు

ఆంధ్రప్రదేశ్‌లోని రైతు భరోసా కేంద్రాలకు అరుదైన గుర్తింపు దక్కంది. దీనిపై హర్షం వ్యక్తం చేశారు వ్యవసాయ మంత్రి కాకాని గోవర్ధన్‌ రెడ్డి.

UNO AWARD to AP: రైతు భరోసా కేంద్రాలకు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు.. ఆర్బీకేలను వరించిన ఛాంపియన్‌ అవార్డు
Rythu Bharosa Kendras

Updated on: May 05, 2022 | 7:03 AM

UNO AWARDS for Rythu Bharosa Kendras: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని రైతు భరోసా కేంద్రాలకు అరుదైన గుర్తింపు దక్కంది. దీనిపై హర్షం వ్యక్తం చేశారు వ్యవసాయ మంత్రి కాకాని గోవర్ధన్‌ రెడ్డి(Kakani Govardhan Reddy). విత్తనాల నుంచి విక్రయాల దాకా అన్నదాతలకు దన్నుగా నిలిచి, గ్రామాల్లోనే సేవలన్నీ అందిస్తూ ప్రశంసలు అందుకుంటున్న రైతు భరోసా కేంద్రాలకు అంతర్జాతీయంగా అరుదైన గుర్తింపు దక్కింది. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌, అంతర్జాతీయ స్థాయిలో అందించే అత్యున్నత, ప్రతిష్టాత్మక ఛాంపియన్‌ అవార్డుకు ఆర్బీకేలను కేంద్ర ప్రభుత్వం నామినేట్‌ చేసింది. దీనిపై హర్షం వ్యక్తం చేశారు వ్యవసాయ మంత్రి కాకాని గోవర్ధన్‌ రెడ్డి. రైతుభరోసా కేంద్రాలు ఉన్నతస్థాయికి ఎదిగాయని, సీఎం జగన్‌ రూపకల్పనే రైతు భరోసా కేంద్రాలని స్పష్టం చేశారు. చాంపియన్‌ అవార్డ్‌కు రైతు భరోసా కేంద్రాలు ఎంపికవడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు.

ప్రపంచంలో మరెక్కడా లేని రీతిలో సాగు ఉత్పాదకాలను రైతుల ముంగిటకు తీసుకెళ్లాలన్న ముఖ్యమంత్రి జగన్‌ సంకల్పంతో, రాష్ట్రంలో సచివాలయాలకు అనుబంధంగా గ్రామ స్థాయిలో 10వేల 778 ఆర్బీకేలు ఏర్పాటయ్యాయి. 2020 మే 30న శ్రీకారం చుట్టిన ఈ ఆర్బీకేల ద్వారా వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించిన సమస్త సేవలన్నీ రైతులకు అందిస్తోంది జగన్ ప్రభుత్వం.