Rain Alert: అల్ప పీడనం ఎఫెక్ట్.. రాష్ట్రంలో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు బిగ్‌ అలర్ట్!

AP Rain Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. అల్పపీడనం ప్రభావంతో రాబోయే రెండ్రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని చోట్లు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Rain Alert: అల్ప పీడనం ఎఫెక్ట్.. రాష్ట్రంలో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు బిగ్‌ అలర్ట్!
Andhra Pradesh Weather Update

Updated on: Feb 20, 2026 | 7:05 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాకి వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు అంచనా వేశారు. తర్వాత ఆ అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందందని అధికారులు పేర్కొన్నారు.

అయితే ఈ అల్పపీడన ప్రభావంతో శనివారం, ఆధివారం రాష్ట్రంలోని పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెళ్లడించారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం.. కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు.

ఇక రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. అలాగే కొన్ని చోట్ల ఉరుముల, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని.. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వర్షం పడేటప్పుడు ప్రజలు ఎవరూ చెట్ల క్రింద ఉండరాదని, సముద్ర తీర ప్రాంతాల్లోని మత్స్యారులు ఎవరూ సముద్రంలోకి చేపల వేటలకు వెళ్లకూడదని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us