Andhra Pradesh: ఏపీ ప్రజలకు మరో అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఆన్‌లైన్‌లోకి మరో 25 సేవలు.. ఇక సెకన్లలోనే అన్నీ..
ఏపీలోని ప్రజలకు మరో తీపికబురు అందించింది కూటమి ప్రభుత్వం. మరో 25 రకాల సేవలను ఆన్‌లైన్‌లోకి అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు ఒక పోర్టల్‌ను లాంచ్ చేసింది. దీని ద్వారా మున్సిపల్ సేవలను ఆన్‌లైన్‌లో పొందవచ్చు. మ్యారేజ్ సర్టిఫికేట్ ఈజీగా పొందవచ్చు.

ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు ఆన్‌లైన్ సేవలను విస్తరిస్తోంది. పాలనలో సాంకేతికతను అందిపుచ్చుకుని సులువుగా ప్రజలకు ప్రభుత్వ సేవలు అందిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం వాట్సప్ గవర్నెన్స్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీని ద్వారా ఇన్‌కమ్, రెసిడెన్షియల్, కులం వంటి ప్రభుత్వ ధృవీకరణ సర్టిఫికేట్లతో పాటు ఆర్టీసీ, దేవాలయాల్లో దర్శనం, పర్యాటక ప్రదేశాల్లో ఎంట్రీ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ప్రతీదానికి వివిధ ప్రత్యేక వెబ్‌సైట్లోకి వెళ్లి ప్రభుత్వ సేవలు పొందాల్సిన అవసరం లేకుండా అన్నీ ఆన్‌లైన్ సేవలు ఒకేచోట లభించేలా వాట్సప్ గవర్నెన్స్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఎలా వాడాలనే దానిపై గ్రామ, వార్డు సచివాలయ అధికారులు ఇంటింటికి వెళ్లి అవగాహాన కల్పిస్తున్నారు. మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్‌ను ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు. 9552300009 నెంబర్ ద్వారా వాట్సప్ గవర్నెన్స్ ఉపయోగించుకోవచ్చు. ఆ నెంబర్‌కు హాయ్ అనే మెస్సేజ్ పెట్టడం ద్వారా సర్వీసులను మొదలుపెట్టవచ్చు.
కొత్త సేవలు
ఏపీ పురపాలక శాఖ 25 సేవలను ఆన్లైన్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను తీసుకొచ్చింది. ఈ పోర్టల్ ద్వారా మ్యారేజ్ సర్టిఫికేట్‌తో పాటు ఆస్తి పన్ను చెల్లింపులు చేయవచ్చు. అలాగే ట్రేడ్ లైసెన్స్, మ్యూటేషన్ వంటి 25 రకాల సేవలు ఆన్‌లైన్ ద్వారా ఇంటి వద్ద నుంచే సులువుగా పొందవచ్చు. అలాగే ఏ సర్టిఫికేట్ ఎప్పటిలోగా జారీ చేయాలనే దానిపై ప్రభుత్వం గడువు విధించింది. మ్యారేజ్ సర్టిఫికేట్‌ను 3 రోజుల్లోగా జారీ చేయాల్సి ఉంటుంది. ఇక ట్రేడ్ లైసెన్స్ 7 రోజులు, ఇంటి పన్నుకు 15 రోజుల గుడువు విధించింది. దీని ద్వారా సర్టిఫికేట్ల జారీలో వేగం పెరగనుంది. అంతేకాకుండా ఆ గడువు ముగిసిన తర్వాత సర్టిఫికేట్లు జారీ చేయకపోతే కారణాలను తెలపాల్సి ఉంటుంది. ఒకవేళ దరఖాస్తు రిజెక్ట్ చేసినా రీజన్ చెప్పాల్సి ఉంటుది. అధికారులు గుడువులోగా దరఖాస్తులు క్లియర్ చేయకపోతే క్రమిశిక్షణ చర్యలు కూడా తీసుకుంటారు. దరఖాస్తులు,సర్టిఫికేట్ల జారీలో పారదర్శకత, వేగం పెంచేందుకు ఈ ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెసుకొచ్చింది. దీంతో మున్సిపల్ సేవలన్నీ ఆన్‌లైన్‌లోకి అందుబాటులోకి రావడంతో ప్రజలు కూడా వేగంగా సర్టిఫికేట్లు పొందుతారు. త్వరలో మరిన్ని సేవలను ప్రవేశపెట్టనున్నారని తెలుస్తోంది.
ఆన్‌లైన్ ద్వారా ఎలా పొందాలి..?
-cdma.ap.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి
– ‘ఫింగర్ టిప్స్‌లోకి వెళ్లండి
-ఆన్‌లైన్ సర్వీసెస్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి
-మీకు అవసరమైన సేవను సెలక్ట్ చేసుకోవాలి
-నగరం, పట్టణాన్ని ఎంచుకోవాలి
-డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయాలి
-వివరాలు మున్సిపల్ కమిషనర్ లాగిన్‌కు వెళతాయి
-ఆ తర్వాత అధికారులు పరిశీలించి జారీ చేస్తారు
