ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో 243 పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం సోమవారం (ఏప్రిల్ 3) ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం పోస్టుల్లో 61 చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సీడీపీవో), అసిస్టెంట్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఏసీడీపీవో), మహిళా-శిశు సంక్షేమ అధికారి, రీజినల్ మేనేజర్ పోస్టులు, 161 గ్రేడ్–1 సూపర్వైజర్ పోస్టులు, 21 శిశు సంరక్షణ కేంద్రాల సూపరింటెండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులన్నింటినీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకు సంబంధించిన నియామక నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయనున్నారు. విద్యార్హతలు, నియామక విధానం, దరఖాస్తు ప్రక్రియ వంటి పూర్తి వివరాలు వివరణాత్మక నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.