Andhra Pradesh: అన్న క్యాంటీన్లపై ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్.. ఈ నెల 15 నుంచి వారికి కూడా సేవలు.. సిద్దంగా ఉండండి..

అన్న క్యాంటీన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాలకు కూడా వీటిని విస్తరించేందుకు సిద్దమవుతోంది. అందులో భాగంగా గ్రామాల్లో కొత్తగా 62 క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. ఇప్పటికే వీటి నిర్మాణం పూర్తవ్వగా.. ఈ నెల 15వ తేదీన సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.

Andhra Pradesh: అన్న క్యాంటీన్లపై ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్.. ఈ నెల 15 నుంచి వారికి కూడా సేవలు.. సిద్దంగా ఉండండి..
Anna Canteen

Updated on: Apr 14, 2026 | 7:27 AM

ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. కేవలం రూ.5కే రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అందించే అన్న క్యాంటీన్లను మరింతగా విస్తరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంగా మరిన్ని అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 269 క్యాంటీన్లను ప్రారంభించగా.. ఇప్పుడు కొత్తగా మరో 62 క్యాంటీన్లను ప్రారంభించనుంది. ఈ మేరకు వీటి ప్రారంభోత్సవానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. ఈ నెల 15వ తేదీన పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం ధరణికోటలో సీఎం చంద్రబాబు స్వయంగా కొత్త అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ప్రజలతో కలిసి భోజనం చేయనున్నారు. కొత్తగా ప్రారంభించనున్న వాటితో కలిపి రాష్ట్రంలో మొత్తం క్యాంటీన్ల సంఖ్య 269కి చేరుకోనుందని అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో విడతల వారీగా మరిన్ని ఏర్పాటు చేసే దిశగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేసింది.

ఈ సారి గ్రామీణ ప్రాంతాల్లో..

ఇప్పటివరకు కేవలం నగరాలు, పట్టణాల్లో మాత్రమే అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. అయితే ఈ సారి కొత్తగా ప్రారంభించనున్న క్యాంటీన్లను గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని మండల కేంద్రాల్లో వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. రూరల్ ప్రజలకు కూడా అన్న క్యాంటీన్ల ద్వారా తక్కువ ధరకే పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో వీటిని నెలకొల్పారు. ఇప్పటివరకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వీటిని ఏర్పాటు చేయగా.. ఇప్పుడు గ్రామాలకు కూడా విస్తరించనున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 8.80 కోట్ల మంది అన్న క్యాంటీన్లలో భోజనం చేయగా.. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించడంతో ఈ సంఖ్య మరింత పెరగనుంది. ఒక్కొ క్యాంటీన్‌లో రోజుకు వెయ్యి మంది వరకు భోజనం చేస్తుండగా.. రోజుకు రూ.26 వేల వరకు ఖర్చు అవుతోంది. ప్రస్తుతం రోజూ 2.10 లక్షల మంది రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల సేవలను ఉపయోగించుకుంటున్నారు.

రోజుకు రూ.54 లక్షల ఖర్చు

అన్న క్యాంటీన్లకు రోజుకు రూ.54 లక్షల వరకు ఖర్చు అవుతుందని అధికారులు చెబుతున్నారు. సబ్సిడీ కింద ప్రభుత్వం ఇప్పటివరకు రూ.243 కోట్ల వరకు ఖర్చు చేసింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటయ్యే క్యాంటీన్లను రూ.58 కోట్లు ఖర్చు కానుందని అధికారులు అంచనా వేశారు. అన్న క్యాంటీన్లలో బ్రేక్‌ఫాస్ట్‌గా ఇడ్లీ, పూరీ, ఉప్మా, పొంగల్ లాంటివి అందిస్తున్నారు. ఇక లంచ్, డిన్నర్ రూపంలో రైస్, పప్పు, సాంబార్, పెరుగు, పచ్చడి, ఒక కూర అందిస్తున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు ఇవి తెరిచి ఉంటుండగా.. ఆదివారం మూసివేస్తున్నారు.

Follow Us