Police vs Mafia: పోలీస్ శాఖపై మాజీ మంత్రి సంచలన కామెంట్స్.. లోకల్ మాఫియాలో వారి ప్రమేయం ఉందంటూ..

|

Dec 29, 2021 | 6:09 PM

Andhra Pradesh Politics: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖపై మాజీ మంత్రి, వైసీపీ నేత ఆనం రామనారాయణ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో నక్సలిజం,

Police vs Mafia: పోలీస్ శాఖపై మాజీ మంత్రి సంచలన కామెంట్స్.. లోకల్ మాఫియాలో వారి ప్రమేయం ఉందంటూ..
Anam Ram Narayana Reddy
Follow us on

Andhra Pradesh Politics: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖపై మాజీ మంత్రి, వైసీపీ నేత ఆనం రామనారాయణ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో నక్సలిజం, టెర్రరిజం తగ్గిందన్నారు. అయితే, తగ్గాల్సింది మరొకటి ఉందన్నారు. ఇవాళ నెల్లూరు జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. లోకల్ మాఫియా ఆగడాల్సి తగ్గాల్సి ఉందన్నారు. అయితే, లోకల్ మాఫియాలో పోలీస్ శాఖ ఇన్వాల్వ్‌మెంట్ ఉందంటూ బాంబ్ పేల్చారు ఆనం రామనారాయణ రెడ్డి. లోకల్ మాఫియాలో పోలీసుల ప్రమేయం సరికాదన్న ఆయన.. ఈ విధానాల వల్ల పోలీసు శాఖపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందన్నారు. ఇప్పటికీ పోలీసు శాఖపై ప్రజల్లో నమ్మకం, భరోసా ఉందని.. పోలీసులను ఆశ్రయిస్తే న్యాయం చేస్తారని విశ్వసిస్తున్నారని అన్నారు. మరి పోలీసు శాఖ, మాఫియా కలిస్తే రాష్ట్రంలో సామాన్యుడికి భద్రత ఉంటుందా? అని రామనారాయణ రెడ్డి ప్రశ్నించారు.

Also read:

New Year Celebrations: తగ్గేదెలే అంటే తాటతీస్తాం.. న్యూ ఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసుల వార్నింగ్

Petrol Price: పెట్రోల్ పై ఏకంగా రూ.25 తగ్గింపు.. దానికోసమే తగ్గించారు అంటూ నెటిజన్లు కామెంట్స్.. (వీడియో)

Watch Video: పార్లమెంట్‌లో రచ్చ రచ్చ.. ఒకరినొకరు కొట్టుకున్న జోర్డాన్‌ ఎంపీలు.. షాకింగ్‌ వీడియో