AP New Cabinet: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)కేబినెట్‌లో కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు. ఈసారి కూడా ఐదుగరు ఉప ముఖ్యమంత్రులను నియమించారు.. అలాగే హోంమంత్రి(Home Minister) పదవి దళిత మహిళకు దక్కింది. డిప్యూటీ సీఎంలుగా నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణ, అంజాద్ బాషా, ముత్యాల నాయుడు, రాజన్న దొరకు పదవులు దక్కాయి. హోంమంత్రిగా తానేటి వనితకు అవకాశం ఇచ్చారు. మొదటి నుంచీ రాష్ట్ర హోం శాఖను నగరి ఎమ్మెల్యే రోజాకు కేటాయిస్తారని ఊహాగానాలు వినిపించాయి. అయితే అనూహ్యంగా హోంశాఖను తానేటి వనితకు కేటాయించారు. గతంలో మేకతోటి సుచరిత హోంశాఖ మంత్రిగా ఉన్నారు. రోజాకు రాష్ట్ర పర్యాటక, యువజన, క్రీడల శాఖను కేటాయించారు.
గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి ఈసారీ ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్ చేపట్టిన శాఖలలో మార్పులు చేసి విద్యా శాఖను బొత్సకు.. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖను సురేశ్‌కు కేటాయించారు. నారాయణస్వామికి మళ్లీ డిప్యూటీ సీఎం పదవితో పాటూ ఎక్సైజ్ శాఖ దక్కింది. అంజాద్‌బాషాకు డిప్యూటీ సీఎం పదవి, మైనార్టీ సంక్షేమం అప్పగించారు. సీదిరి అప్పలరాజుకు మత్స్య, పశుసంవర్థకశాఖ కొనసాగించారు. గుమ్మనూరు జయరాంకు కార్మిక శాఖను తిరిగి అప్పగించారు. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు గతంలో ఉన్న బీసీ సంక్షేమంతో పాటూ సినిమాటోగ్రఫీ, సమాచార శాక బాధ్యతలు కేటాయించారు. అంబటి రాంబాబుకు కీలకమైన నీటిపారుదలశాఖ బాధ్యతలు ఇవ్వడం విశేషం. ఊహించని విధంగా మంత్రి బొత్సకు విద్యాశాఖ దక్కింది.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినవారిలో ఒకరు డాక్టర్ కాగా, ముగ్గురు పీహెచ్‌డీలు పూర్తి చేశారు. ఐదుగురు మంత్రులు పోస్టు గ్రాడ్యుయేట్లు కాగా, 9 మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఇద్దరు మంత్రులు ఇంజినీర్లు. ఇక, ఇంటర్మీడియట్ కంటే తక్కువగా విద్యార్హతలు కలిగి ఉన్నవారు ఐదుగురు మంత్రులు ఉన్నారు. మంత్రుల్లో నలుగురు మహిళలకు అవకాశం దక్కింది. సీఎం వైఎస్ జగన్ రెండో విడత మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వారలో ఐదుగురికి డిప్యూటీ సీఎం పోస్టులు దక్కాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 4 డిప్యూటీ సీఎం పోస్టులు కట్టబెట్టారు సీఎం జగన్.
ఏపీ మంత్రులు-శాఖలు