Andhra Pradesh: నిర్వాసితులకు పరిహారం ఇచ్చాకే పోలవరంలో నీళ్లు నింపుతాం.. సీఎం జగన్

పోలవరం (Polavaram) ప్రాజెక్టు విషయంలో సీఎం జగన్ సంచలన కామెంట్స్ చేశారు. సెప్టెంబర్ లోపు నిర్వాసితులకు పరిహారం ఇచ్చాకే ప్రాజెక్టులే నీళ్లు నింపుతామని వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన...

Andhra Pradesh: నిర్వాసితులకు పరిహారం ఇచ్చాకే పోలవరంలో నీళ్లు నింపుతాం.. సీఎం జగన్
Cm Jagan
Follow us

|

Updated on: Jul 27, 2022 | 5:11 PM

పోలవరం (Polavaram) ప్రాజెక్టు విషయంలో సీఎం జగన్ సంచలన కామెంట్స్ చేశారు. సెప్టెంబర్ లోపు నిర్వాసితులకు పరిహారం ఇచ్చాకే ప్రాజెక్టులే నీళ్లు నింపుతామని వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్యాకేజీ కోసం కేంద్రంతో పోరాటం చేస్తున్నామన్న సీఎం (CM Jagan).. నిధుల విడుదల కోసం తరచూ కేంద్రానికి లేఖలు రాస్తున్నామని వెల్లడించారు. ఈ విషయంలో ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. ప్రాజెక్టుకు రాష్ట్రం రూ.20వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో ఒకేసారి నీరు నింపితే డ్యామ్‌ భద్రతకు ప్రమాదమని అందుకే మొదటగా 41.15 మీటర్ల వరకే నీళ్లు నింపుతామని పేర్కొన్నారు. మూడేళ్లలో పూర్తిగా నింపేస్తామని, . పూర్తిగా నింపే నాటికి ఏ ఒక్కరికీ నష్టం జరగదని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. చింతూరులో పర్యటించిన ఆయన.. నాలుగు మండలాల్లో కలెక్టర్‌ 20 రోజుల పాటు ఉన్నారని, . కలెక్టర్‌, అధికారులు, వాలంటీర్లు స్థానికంగా అందుబాటులో ఉండి ఎలాంటి ప్రమాదం రాకుండా చూసుకున్నారని చెప్పారు.

సహాయం అందరికీ అందాలి. అందరికీ బియ్యంయ, నిత్యవసరాలు, కుటుంబానికి రూ.2 వేలు ఇచ్చాం. వరద వల్ల ఎవరికి నష్టం జరిగినా వారి పేర్లు గ్రామ సచివాలయంలో లిస్ట్‌లో ఉంటాయి. అర్హత ఉన్న అందరికీ రెండు నెలల్లో పరిహారం అందుతుంది. తాటాకు గుడిసెల నిర్వాసితులకు పరిహారం రూ. పది వేలకు పెంచుతాం. పోలవరం ముంపు బాధితుల విషయంలో కేంద్రం నుంచి నిధులు రాకపోతే ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. కేంద్రంపై ఒత్తిడి పెంచుతాం.. నిర్వాసితులను ఆదుకుంటాం.

      – వైఎస్.జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

ఇవి కూడా చదవండి

కాగా.. దాదాపు పదిరోజుల క్రితం గోదావరికి భారీ స్థాయిలో వరదలు వచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణలోని మంచిర్యాల నుంచి, ఆంధ్రప్రదేశ్ లోని సాగరసంగమనం వరకు నదీ పరివాహక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు ముంపునకు గురయ్యాయి. ఇళ్లల్లోకి వరద చేరింది. ఇల్లూ పొలాలను తనలో కలిపేసుకుంది. దాదాపు వారం రోజుల పాటు ఉద్ధృతంగా ప్రవహించిన గోదావరి ప్రస్తుతం శాంతించింది. అయినప్పటికీ.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తూనే ఉన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..