Andhra News: నాన్నమ్మ కమ్మలపై కన్నేసిన మనవడు.. వాటి కోసం ఏం చేశాడో తెలిస్తే..

కాసుల కాక్కుర్తితో రక్తసంబంధాన్ని సైతం మర్చిపోయిన ఓ మనవడు.. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన నానమ్మ పాలిట కాలయముడయ్యాడు. బంగారు కమ్మల కోసం 87 ఏళ్ల వృద్ధురాలిని అత్యంత పాశవికంగా హతమార్చాడు. అనంతపురం నగరంలోని కొవ్వూరు నగర్‌లో వెలుగు చూసి ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Andhra News: నాన్నమ్మ కమ్మలపై కన్నేసిన మనవడు..  వాటి కోసం ఏం చేశాడో తెలిస్తే..
Horrific Crime In Anantapur

Edited By:

Updated on: Oct 06, 2026 | 9:18 AM

అనంతపురం జిల్లాలో దారుణం వెలుగు చూసింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన మనవడే.. ఓ వృద్దురాలి పాలిక కాలయముడిగా మారాడు. పైసల కక్కుర్తితో, బంగారు కమ్మల కోసం నానమ్మనే అత్యంత పాశవికంగా అంతం చేశాడు.వివరాల్లోకి వెళ్తే.. ​కొవ్వూరు నగర్‌లో ఒంటరిగా నివాసముంటున్న మీసాల సన్నాగులు అనే 87 ఏళ్ల వృద్ధురాలు తన ఇంట్లో రక్తపు మడుగులో శవమై కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. వృద్ధురాలి తలపై తీవ్ర గాయాలు ఉండటం, చెవులకు ఉన్న బంగారు కమ్మలు మాయం కావడంతో.. ఇది ఖచ్చితంగా దొంగతనానికి వచ్చిన దుండగుల పనే అని భావించారు.

మనవడి కదలికపై అనుమానం

​అయితే ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు.. ఘటనా స్థలంతో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ విచారణలో వృద్ధురాలికి వరుసకు మనవడైన లక్ష్మీనారాయణ కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. వెంటనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడి ఆచూకీ గుర్తించిన పోలీసులు, హత్య జరిగిన కేవలం ఐదు గంటల వ్యవధిలోనే రాంనగర్ ఫ్లైఓవర్ సమీపంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఒళ్లు గగుర్పొడిచే నిజాలు

పోలీసుల విచారణలో లక్ష్మీనారాయణ పాల్పడిన కిరాతక చర్యలు వెలుగులోకి వచ్చాయి. బంగారు కమ్మల కోసం ఇంట్లో ఉన్న రోకలిబండతో నానమ్మ తలపై బలంగా బాది హత్య చేసినట్లు తేలింది. అనంతరం బ్లేడుతో ఆమె చెవులను కోసి మరీ కమ్మలను ఎత్తుకెళ్లాడని అనంతపురం అర్బన్ డీఎస్పీ కరుణాకర్ రావు స్పష్టం చేశారు. వృద్ధురాలన్న జాలి, దయ కూడా లేకుండా ఈ దారుణానికి ఒడిగట్టాడని తెలిపారు. ఈ కేసును అత్యంత వేగంగా, కేవలం ఐదు గంటల్లోనే ఛేదించి నిందితుడిని అరెస్టు చేసిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ జగదీష్ ప్రత్యేకంగా అభినందించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us