ఇవాళ బెంగళూరుకు జగన్‌.. రేపు కూడా అక్కడే ఉండనున్న సీఎం

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ బెంగళూరుకు వెళ్లనున్నారు. జగన్ పెద్ద కుమార్తె హర్ష రెడ్డికి ప్రపంచ ప్రఖ్యాత ఇన్సీడ్ బిజినెస్ స్కూల్‌లో సీటు రావడంతో

ఇవాళ బెంగళూరుకు జగన్‌.. రేపు కూడా అక్కడే ఉండనున్న సీఎం

Updated on: Aug 25, 2020 | 11:43 AM

CM YS Jagan News: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ బెంగళూరుకు వెళ్లనున్నారు. జగన్ పెద్ద కుమార్తె హర్ష రెడ్డికి ప్రపంచ ప్రఖ్యాత ఇన్సీడ్ బిజినెస్ స్కూల్‌లో సీటు రావడంతో.. ఆమెను పారిస్‌కి పంపేందుకు ఆయన బెంగళూరు వెళ్లనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ క్రమంలో బుధవారం(ఆగష్టు 26) కూడా జగన్ బెంగళూరులోనే ఉండనున్నారు. ఆ తరువాత గురువారం (ఆగష్టు 27) ఆయన తాడేపల్లి నివాసానికి తిరిగి రానున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. కాగా ఇప్పటికే లండన్‌ స్కూల్ ఆఫ్‌ ఎకనమిక్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన హర్ష రెడ్డి.. ఇప్పుడు మాస్టర్స్‌ని ఇన్సీడ్‌లో అభ్యసించనున్నారు.

Read More:

గెలవలేమని తెలిసే బాబు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు: ఎమ్మెల్యే శ్రీదేవి

చనిపోయిన రోజు డ్రగ్ డీలర్‌ని కలిసిన సుశాంత్‌

Loading...
Unable to load recommendations.
Follow Us