వైసీపీ విజయం ఖాయం: తమ్మినేని సీతారాం

| Edited By:

May 14, 2019 | 3:53 PM

ఏపీ ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని ఆ పార్టీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఏపీ ప్రజలు వైఎస్ జగన్ కు విజయాన్ని అందించబోతున్నారని అన్నారు. అసెంబ్లీ స్థానాల్లోనే కాదు పార్లమెంట్ స్థానాల్లోనూ వైసీపీ విజయ గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. నాలుగేళ్లు బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ఏపీకి ఏం సాధించలేక చతికిలపడ్డారని అన్నారు. తన చేతగానితనాన్ని చాటుకున్న చంద్రబాబు తిరిగి కేంద్రంపైనే […]

వైసీపీ విజయం ఖాయం: తమ్మినేని సీతారాం
Follow us on

ఏపీ ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని ఆ పార్టీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఏపీ ప్రజలు వైఎస్ జగన్ కు విజయాన్ని అందించబోతున్నారని అన్నారు. అసెంబ్లీ స్థానాల్లోనే కాదు పార్లమెంట్ స్థానాల్లోనూ వైసీపీ విజయ గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.

నాలుగేళ్లు బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ఏపీకి ఏం సాధించలేక చతికిలపడ్డారని అన్నారు. తన చేతగానితనాన్ని చాటుకున్న చంద్రబాబు తిరిగి కేంద్రంపైనే విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన టీడీపీ భారతదేశ రాజకీయాల్లో నేడు చరిత్ర హీనంగా మిగిలిపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.