పాల వ్యాన్‌లో మద్యం…!

|

Sep 26, 2020 | 6:00 PM

మద్యం అక్రమ రవాణా కొత్త పుంతలు తొక్కుతోంది. తెలంగాణ సరిహద్దులో పోలీసులు అక్రమ రవాణాకు అడ్డుకట్టువేసేందుకు పటిష్ట చర్యలు చేపడుతుండగా,..మరోవైపు అధికారుల కళ్లుగప్పి మద్యం రవాణా చేసేందుకు గానూ, దుండగులు ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు.

పాల వ్యాన్‌లో మద్యం...!
Follow us on

మద్యం అక్రమ రవాణా కొత్త పుంతలు తొక్కుతోంది. తెలంగాణ సరిహద్దులో పోలీసులు అక్రమ రవాణాకు అడ్డుకట్టువేసేందుకు పటిష్ట చర్యలు చేపడుతుండగా,..మరోవైపు అధికారుల కళ్లుగప్పి మద్యం రవాణా చేసేందుకు గానూ, దుండగులు ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. వినూత్న రీతిలో మద్యం తరలిస్తూ పట్టుబడుతున్న ఘటనలు ఇటీవల అనేకం వెలుగులోకి వస్తున్నాయి.

ఏపీలో క్రమంగా అక్రమ మద్యం వ్యవహారాలు అనేకం బయటపడుతున్నాయి. అంబులెన్స్‌లో, చేపలు తరలించే వ్యాన్‌లో, బియ్యం బస్తాలు, ఖాళీ గ్యాస్ సిలిండర్లు, ఒంటికి ప్లాస్టర్లు అంటించుకుని మద్యం తరలిస్తూ పట్టుబడ్డ ఘటనలు అనేకం చూశాం. ఇప్పుడు మరో కొత్త మార్గం బయటపడింది. కృష్ణా జిల్లా కంచికచర్ల పోలీసుల తనిఖీల్లో భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టుబడింది. పాల వ్యాన్ లో మద్యం తరలిస్తూ ఉండగా అధికారులు పట్టుకున్నారు. పాల వ్యాన్ ని కూడా అధికారులు స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని ఉయ్యూరు పోలీస్ స్టేషన్ కి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.