జగనన్న విద్యాకానుక పథకం వాయిదా

ప్రతిష్టాత్మక నవరత్న కార్యక్రమాల్లో భాగంగా జగన్ సర్కారు ఏపీలో తీసుకొచ్చిన పథకం 'జగనన్న విద్యా కానుక'. ప్రస్తుత కరోనా నేపథ్యంలో జగనన్న విద్యా కానుక కార్యక్రమం వాయిదా పడింది.

జగనన్న విద్యాకానుక పథకం వాయిదా

Updated on: Sep 04, 2020 | 9:07 PM

ప్రతిష్టాత్మక నవరత్న కార్యక్రమాల్లో భాగంగా జగన్ సర్కారు ఏపీలో తీసుకొచ్చిన పథకం ‘జగనన్న విద్యా కానుక’. ప్రస్తుత కరోనా నేపథ్యంలో జగనన్న విద్యా కానుక కార్యక్రమం వాయిదా పడింది. సెప్టెంబరు 30 వరకు పాఠశాలలు తెరవరాదని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర పాఠశాల విద్య డైరెక్టర్ తెలిపారు. బదులుగా అక్టోబరు 5న జగనన్న విద్యా కానుక కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. దాంతో ఈ నెల 5న చేపట్టాల్సిన జగనన్న విద్యా కానుక నెల రోజులు వాయిదా పడింది.