అసెంబ్లీలో పోలవరం పై హాట్ హాట్ చర్చ

ఏపీ అసెంబ్లీలో పోలవరం పై హాట్ హాట్‌గా చర్చ జరిగింది. పోలవరం పై ప్రత్యేక చర్చ పెట్టాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. భూ సేకరణ చట్టం వచ్చిన తర్వాత పరిహారం 3 వేల కోట్ల నుంచి 33 వేల కోట్ల రూపాయలకు చేరిందని ఆయన తెలిపారు. చంద్రబాబు వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. 2018 కల్లా పోలవరంను పూర్తి చేస్తామని సవాల్ విసిరిన నేతలు.. ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. […]

అసెంబ్లీలో పోలవరం పై హాట్ హాట్ చర్చ

Edited By:

Updated on: Jul 15, 2019 | 3:04 PM

ఏపీ అసెంబ్లీలో పోలవరం పై హాట్ హాట్‌గా చర్చ జరిగింది. పోలవరం పై ప్రత్యేక చర్చ పెట్టాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. భూ సేకరణ చట్టం వచ్చిన తర్వాత పరిహారం 3 వేల కోట్ల నుంచి 33 వేల కోట్ల రూపాయలకు చేరిందని ఆయన తెలిపారు. చంద్రబాబు వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. 2018 కల్లా పోలవరంను పూర్తి చేస్తామని సవాల్ విసిరిన నేతలు.. ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. అసలు 9 ఏళ్లు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశారని అనిల్ కుమార్ ఫైర్ అయ్యారు. పోలవరం దగ్గర ఫోటోలు, శిలాఫలకాలు తప్ప ఏం చేయలేదని విమర్శించారు. వెలిగొండ ప్రాజెక్టు అంచనాలను 1500 కోట్ల రూపాయలు పెంచి.. ఎవరికి ఇచ్చారో తెలుసంటూ ఎద్దేవా చేశారు. ఈ బడ్జెట్‌లో 5వేల 400 కోట్లు పోలవరం కోసం కేటాయించామని చెప్పారు. నాలుగేళ్లలో టీడీపీ ప్రభుత్వం చేయలేని పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేవలం 2 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం పూర్తి చేస్తుందని అనిల్ కుమార్ సవాల్ విసిరారు.