విద్య వ్యాపారం కాదు, అదొక సేవ : సీఎం జగన్

|

Jul 30, 2019 | 2:59 AM

అమరావతి : విద్య వ్యాపారం కాదని, అదొక సేవ మాత్రమేనని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు. సోమవారం పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ బిల్లును ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌  స్పందించారు. పేద, మధ్యతరగతి ప్రజలకు చదువులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. రిటైర్డ్ హైకోర్టు జడ్జిల ఆధ్వర్యంలో స్కూళ్లు, కాలేజీల ఫీజులపై నియంత్రణ, మౌలిక సదుపాయాలపై పర్యవేక్షణకు కమిషన్లను ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో బిల్లులను ఆమోదించామన్నారు. పుట్టిన […]

విద్య వ్యాపారం కాదు, అదొక సేవ : సీఎం జగన్
Follow us on

అమరావతి : విద్య వ్యాపారం కాదని, అదొక సేవ మాత్రమేనని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు. సోమవారం పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ బిల్లును ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌  స్పందించారు. పేద, మధ్యతరగతి ప్రజలకు చదువులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. రిటైర్డ్ హైకోర్టు జడ్జిల ఆధ్వర్యంలో స్కూళ్లు, కాలేజీల ఫీజులపై నియంత్రణ, మౌలిక సదుపాయాలపై పర్యవేక్షణకు కమిషన్లను ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో బిల్లులను ఆమోదించామన్నారు.

పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుడి వరుకు ప్రతి ఒకరికి న్యాయం చెయ్యాలని, ప్రజలకు మంచి జరగాలని, ప్రజలకు చెందాల్సిన సొమ్ము ప్రజలకు చేరాలని వివిధ రకాల సంక్షేమ పథకాలను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఆయన విద్యావ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆంధ్రలో పుట్టిన ప్రతి బిడ్డకు చదువు ఉండాలని ‘రాజన్న బడిబాట’ , ‘అమ్మఒడి’ వంటి సంచలన పథకాలను ప్రవేశపెట్టారు.