ప్రశ్నిస్తే లారీలతో గుద్దిస్తారా.. దీన్ని డీజీపీ సుమోటోగా స్వీకరిస్తారా?

|

Sep 04, 2020 | 5:43 PM

'ప్రశ్నిస్తే లారీలతో గుద్దిస్తారా? ఎక్కడికి పోతోందీ రాష్ట్రం? సీఎం జగన్, డిఫాక్టో హోం మినిస్టర్ గా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి, పోలీసు వ్యవహారాలు చూస్తున్న అవినాష్.. ఈ ముగ్గురే కుట్రదారులు..

ప్రశ్నిస్తే లారీలతో గుద్దిస్తారా.. దీన్ని డీజీపీ సుమోటోగా స్వీకరిస్తారా?
Follow us on

‘ప్రశ్నిస్తే లారీలతో గుద్దిస్తారా? ఎక్కడికి పోతోందీ రాష్ట్రం? సీఎం జగన్, డిఫాక్టో హోం మినిస్టర్ గా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి, పోలీసు వ్యవహారాలు చూస్తున్న అవినాష్.. ఈ ముగ్గురే కుట్రదారులు. వీళ్ల డైరెక్షన్ లోనే మంత్రి కొడాలి నాని నన్ను లారీలతో గుద్దిస్తానని బెదిరిస్తున్నాడు.. దీన్ని డీజీపీ సుమోటోగా స్వీకరిస్తారా?’ అంటూ ప్రశ్నలు సంధించారు టీడీపీ నేత దేవినేని ఉమ. కొడాలి నాని ఇవాళ మాట్లాడిన భాష చూస్తుంటే దారుణంగా ఉంది. ‘చదువు సంస్కారాన్నిస్తుంది. కానీ చదువు సంస్కారాలు లేని కొడాలి నాని… నీవు చంద్రబాబు వయసు గురించి, మా చావు పుట్టుకల గురించి మాట్లాడుతున్నావు. ఈశ్వరాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఎందుకీ గల్లీ రాజకీయాలు? మీ చేతకాని తనం కప్పిపుచ్చుకోవడానికే ఈ భాష మాట్లాడుతున్నారా?’ అని కొడాలి నానిని టార్గెట్ చేశారు ఉమ. ఈరోజు మీడియా సమావేశంలో కొడాలి నానితో పాటు వసంత కృష్ణప్రసాద్, వల్లభనేని వంశీ ఉన్నారు. నా ఒక్కడికి సమాధానం చెప్పడానికి ముగ్గురా…! ఏంటిది జగన్ గారూ? అంటూ దేవినేని ఉమ ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో ఇచ్చినట్టుగా ఇవాళ విద్యుత్ ఇవ్వలేక.. సోలార్ ఎనర్జీలో కమీషన్లకు కక్కుర్తిపడి.. మీటర్ల కొనుగోలులో వందల కోట్ల అవినీతికి సిద్ధపడి.. ఈ డ్రామా ముందుకు తీసుకువచ్చారని విమర్శలు గుప్పించారు. దీని గురించి ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక బూతుల మంత్రితో బూతులు మాట్లాడించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు దేవినేని ఉమ. ఉచిత విద్యుత్ పథకాన్ని అటకెక్కిస్తున్నారని, మీటర్ల పేరుతో రైతుల గొంతు కోయబోతున్నారని, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం సున్నా అయిందని, రైతు రుణాలకు వడ్డీలు కట్టించుకుంటున్నారని ఉమ.. జగన్ సర్కారుమీద ఆరోపణలు గుప్పించారు.