చంద్రబాబు ఇంటికి ‘కూల్చివేత’ నోటీసులు

|

Jun 28, 2019 | 10:09 AM

కృష్ణా కరకట్ట వెంట ఉన్న అక్రమ కట్టడాల‌పై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో 20 ఇళ్ల యజమానులకు సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇచ్చారు. కాగా అందులో చంద్రబాబు నివాసం(లింగమనేని గెస్ట్ హౌస్) కూడా ఉంది. కరకట్టపై అక్రమంగా నిర్మించారని సీఆర్డీఏ అధికారులు నోటీసులతో పేర్కోగా.. లింగమనేని రమేష్ పేరుతో వారు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ప్రజావేదికను కూల్చివేసిన తరుణంలో తాజా పరిణామం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఇది ముందే గ్రహించిన చంద్రబాబు […]

చంద్రబాబు ఇంటికి కూల్చివేత నోటీసులు
Follow us on

కృష్ణా కరకట్ట వెంట ఉన్న అక్రమ కట్టడాల‌పై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో 20 ఇళ్ల యజమానులకు సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇచ్చారు. కాగా అందులో చంద్రబాబు నివాసం(లింగమనేని గెస్ట్ హౌస్) కూడా ఉంది. కరకట్టపై అక్రమంగా నిర్మించారని సీఆర్డీఏ అధికారులు నోటీసులతో పేర్కోగా.. లింగమనేని రమేష్ పేరుతో వారు నోటీసులు జారీ చేశారు.

ఇప్పటికే ప్రజావేదికను కూల్చివేసిన తరుణంలో తాజా పరిణామం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఇది ముందే గ్రహించిన చంద్రబాబు ఇప్పటికే కొత్త ఇల్లు వెతికే పనిని నేతలకు అప్పగించారు.