ఎమ్మెల్యేలకు సీఎం.. క్లాస్..!

పాలనపై పట్టు సాధించేందుకు ఏపీ సీఎం జగన్ వరుస సమీక్షలతో బిజీగా గడుపుతున్నారు. అటు ఎమ్మెల్యేలను కూడా తీర్చిదిద్దుతున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారం ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్యేల శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ప్రజలకు మరింత చేరువయ్యేలా వ్యవహరించాలన్నారు. ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి, ఆ సమస్య.. సమసిపోయేలా చూడాలని సూచించారు. అలాగే.. పార్టీ కార్యక్రమాలపై ఎమ్మెల్యేలకు దిశానిర్ధేశం చేశారు. అమరావతిలోని అసెంబ్లీ హాల్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అసెంబ్లీలో […]

ఎమ్మెల్యేలకు సీఎం.. క్లాస్..!
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 03, 2019 | 4:29 PM

పాలనపై పట్టు సాధించేందుకు ఏపీ సీఎం జగన్ వరుస సమీక్షలతో బిజీగా గడుపుతున్నారు. అటు ఎమ్మెల్యేలను కూడా తీర్చిదిద్దుతున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారం ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్యేల శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ప్రజలకు మరింత చేరువయ్యేలా వ్యవహరించాలన్నారు. ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి, ఆ సమస్య.. సమసిపోయేలా చూడాలని సూచించారు. అలాగే.. పార్టీ కార్యక్రమాలపై ఎమ్మెల్యేలకు దిశానిర్ధేశం చేశారు. అమరావతిలోని అసెంబ్లీ హాల్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అసెంబ్లీలో పాటించాల్సిన నియమాలు.. ప్రజా సమస్యల పరిష్కారం సహా పలు అంశాలపై ఎమ్మెల్యేలకు శిక్షణ అందిస్తున్నారు.