జగన్ విఙ్ఞప్తికి కేంద్ర ఆమోదం.. సీఎస్‌ పదవీ కాలం పొడిగింపు..!

ఏపీ సీఎం వైఎస్ జగన్ విఙ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. కరోనా నేపథ్యంలో సీఎస్‌ విధులు కీలకమైనందున నీలం సాహ్ని పదవీ కాలం పొడిగించాలంటూ

జగన్ విఙ్ఞప్తికి కేంద్ర ఆమోదం.. సీఎస్‌ పదవీ కాలం పొడిగింపు..!
Follow us

| Edited By:

Updated on: Jun 04, 2020 | 2:54 PM

ఏపీ సీఎం వైఎస్ జగన్ విఙ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. కరోనా నేపథ్యంలో సీఎస్‌ విధులు కీలకమైనందున నీలం సాహ్ని పదవీ కాలం పొడిగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రతిపాదనను కేంద్రానికి పంపింది. అందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి.. సీఎస్ పదవీ కాలాన్ని మరో మూడు నెలల పాటు కొనసాగించింది.

కాగా వైఎస్‌ జగన్ అధికారంలోకి వచ్చిన సమయంలో ఏపీ సీఎస్‌గా ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉన్నారు. గత నవంబర్‌లో ఆయనను ఆ స్థానం నుంచి బదిలీ చేయగా.. నీరబ్ కుమార్ ప్రసాద్ తాత్కాలిక బాధ్యతలు చేపట్టారు. ఇక నవంబర్ 13న జగన్ ప్రభుత్వం సీఎస్‌గా నీలం సాహ్నిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1984వ ఐఏఎస్‌ బ్యాచ్‌కి చెందిన సాహ్ని.. కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయిన తరువాత ఏపీ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఈ నెల 31తో సాహ్ని పదవీ కాలం ముగియాల్సి ఉండేది. అయితే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో జూలై 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు ఏపీ సీఎస్ పదవిలో సాహ్ని కొనసాగనున్నారు.

Read This Story Also: ‘కరోనా పోరు’పై ఏపీ ప్రభుత్వం పాట.. భాగమైన కాజల్, నిఖిల్, ప్రణీత..!