AP Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే.. స్పష్టం చేసిన కేంద్రం

|

Feb 02, 2022 | 11:42 AM

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కేంద్ర స్పష్టత ఇచ్చింది. 'ఏపీ రాజధాని ఏది?' ఎవరు నిర్ణయం తీసుకోవాలి అని  జీవీఎల్ ప్రశ్నించగా.. అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇచ్చారు.

AP Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే.. స్పష్టం చేసిన కేంద్రం
Amaravathi
Follow us on

Amaravathi: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజధాని అమరావతేనని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు(GVL Narasimha Rao)ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.  ఏపీ రాజధాని విషయంలో సందిగ్ధం నెలకొందని, 3 రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకున్న తర్వాత రాజధాని ఏదో తెలియడం లేదని రాజ్యసభలో జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వద్ద సమాచారం ప్రకారం ఏపీ రాజధాని ఏది? ఎవరు నిర్ణయం తీసుకోవాలి అని  జీవీఎల్ ప్రశ్నించారు. రాజధానిపై నిర్ణయం రాష్ట్రానిదేనని కేంద్రం తేల్చి చెప్పింది. “మొదట ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని మాకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత 3 రాజధానులని, పాలనా రాజధానిగా విశాఖపట్నం, జ్యుడీషియల్ కేపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా అమరావతి అని తర్వాత చెప్పారు. ఆ బిల్లులను వెనక్కి తీసుకున్నట్టు మేం కూడా వార్తల ద్వారా తెలుసుకున్నాం. మా దగ్గర అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే” అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ స్పష్టం చేశారు.

Also Read: హడలెత్తిస్తున్న ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌.. షాకింగ్ విషయం చెప్పిన డెన్మార్క్‌ సైంటిస్టులు