ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. ఓ వైపు స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లు ప్రారంభమైన విషయం తెలిసిందే. త్వరలో జరగబోయే ఈ ఎన్నికల్లో అధికార వైసీపీపై టీడీపీ పైచేయి సాధించాలని ప్రయత్నిస్తున్న వేళ.. మాజీ మంత్రి టీడీపీకి గుడ్‌పై చెప్పిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. అమరావతి రాజధాని విషయంలో ఇప్పటివరకు టీడీపీకి అనుకూలంగా జరిగిన సంఘీభావ సభలు.. ఇప్పుడు సీఎం జగన్‌కు మద్ధతుగా నిలుస్తున్నాయి.
మూడు రాజధానులకు మద్దతుగా అమరావతిలో సంఘీభావ సభలు నిర్వహించారు. వికేంద్రీకరణకు మద్దతు తెలుపుతూ టెంట్లు వేసి తమ గళాన్ని వినిపించారు. సీఎం జగన్ నిర్ణయం సరైందేనని బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో టెంట్లు వేసి కార్యక్రమం చేపట్టారు. మూడు రాజధానుల వల్లే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందన్నారు. అంతేకాదు బలహీనవర్గాలకు కూడా న్యాయం జరుగుతుందన్నారు. అయితే ఈ క్రమంలో పలు డిమాండ్లు చేస్తున్నారు. అమరావతి ప్రాంతంలో ఉన్న పేదలకు 50 వేల పక్కా ఇళ్లు ఇవ్వాలంటూ బహుజన పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తోంది.
ఇదిలాఉంటే.. ఇప్పటికే రాజధాని గ్రామాల్లో కొన్ని ఎకరాల భూమిని పేదలకు పంచుతామంటూ ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. త్వరలో పేదలకు ప్రభుత్వం ఇళ్ల పట్టాల్ని కూడా పంపిణీ చేస్తుందని కూడా పేర్కొంది. ఈ క్రమంలోనే బహుజన పరిరక్షణ సమితి పక్కా ఇళ్లు ఇవ్వాలన్న డిమాండ్ చేస్తుంది.