డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ పై జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే కొడుకు తన ప్రతాపం చూపించాడు. నా కారునే అడ్డుకుంటావా అంటూ అతడిని తిట్టడమే కాకుండా, కాలితో తన్నాడు. దీంతో సీఐ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంకటకృష్ణ ప్రసాద్‌ను అరెస్టు చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కుమారుడు వెంకట కృష్ణప్రసాద్ హైటెక్‌సిటీ సమీపంలోని మీనాక్షి టవర్స్‌లో ఉంటున్నాడు. సోమవారం సాయంత్రం నోవాటెల్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఈ క్రమంలో హైటెక్స్ కమాన్ వైపు వెళుతున్న వాహనాలను కానిస్టేబుల్ కొద్ది సేపు నిలిపివేశాడు. అదే సమయంలో అటుగా వస్తున్న కృష్ణ కారును కానిస్టేబుల్ అడ్డుకుని ఆపాడు. దీంతో కానిస్టేబుల్‌తో కృష్ణ వాగ్వాదానికి దిగాడు. తిట్టడమే కాకుండా కాలితో తన్నాడు.