సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పనుల పురోగతి పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం స్పిల్ వే, కాపర్ డ్యాం ప్రాంతంలో పర్యటించారు. సీఎం వెంట ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. పోలవరం పర్యటన అనంతరం అమరావతి చేరుకొని.. అమలాపురం పార్లమెంట్ పరిధిలోని నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు.