ఏపీలో 12 కొత్త జిల్లాలు ఏర్పాటు..!

13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ కాస్తా త్వరలోనే...25 జిల్లాలుగా మారనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో జిల్లాల సంఖ్య త్వరలోనే పెరగనుందనే సంకేతాలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలను గమనిస్తే...

ఏపీలో 12 కొత్త జిల్లాలు ఏర్పాటు..!

Updated on: Jun 23, 2020 | 5:37 PM

13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ కాస్తా త్వరలోనే…25 జిల్లాలుగా మారనుందని తెలుస్తోంది. ఏపీలో జిల్లాల సంఖ్య త్వరలోనే పెరగనుందనే సంకేతాలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలను గమనిస్తే.. ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పడనున్నట్లు స్పష్టమవుతోంది.

మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కార్ఫరెన్స్‌లో సీఎం జగన్ నోట కొత్త జిల్లాల ఏర్పాటు మాట వచ్చింది. ఇదే విషయాన్ని ఆయన స్పష్టంగా వెల్లడించారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసే ఆలోచన ఉందని అధికారులకు సీఎం వివరించారు. జిల్లాకు ఒక బోధన ఆస్పత్రి ఏర్పాటు అంశంపై ఏర్పాటు చేసిన సమావేశంలో జగన్ కొత్త జిల్లాల ప్రస్థావన తీసుకువచ్చారు. కాగా, సీఎం సూచనల నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. జిల్లాల ఏర్పాటుపై కసరత్తు ప్రారంభించారు. సీఎం నిర్ణయం ప్రకారం ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు అదనంగా 12 కొత్త జిల్లాలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.

Follow Us