Chittoor: చిత్తూరులో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఓ అవినీతి వీఆర్వో. మదనపల్లె మండలం బసినికొండకు చెందిన వీఆర్వో గంగాద్రి, రామకృష్ణ అనే రైతు భూమిని ఆన్లైన్లో నమోదు చేయడానికి లంచం డిమాండ్ చేశాడు. లక్ష రూపాయాలు లంచం ఇస్తేనే రామకృష్ణ భూమిని ఆన్లైన్లో నమోదు చేస్తానని చెప్పాడు. దీంతో చేసేదేమి లేక ఆ రైతు రూ.లక్ష లంచం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో ఓటి దుకాణం దగ్గర లంచం తీసుకుంటుండగా పథకం ప్రకారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వీఆర్వో గంగాద్రి నుంచి లక్ష రూపాయాలు స్వాధినం చేసుకున్నారు ఏసీబీ అధికారులు.