అమలాపురంలో చక్కర్లు కొట్టిన రోల్స్ రాయిస్ కారు.. పటాకులతో అల్లుడికి ఘన స్వాగతం

|

Jan 12, 2024 | 1:13 PM

కోడిపందాలు, పిండివంటలు, హరివిల్లుని తలపించే రంగుల ముగ్గులు, గొబ్బెలు, హరిదాసులు, కొత్త అల్లులతో సంక్రాంతి పండగ హడావుడి, ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు స్థానికులు. ఇక కోనసీమలో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది...ఊరికి దూరంగా ఉంటూ ఉద్యోగాలు, వ్యాపారాలతో తీరిక లేకుండా గడిపే కోనసీమ వాసులు ఈ సంక్రాంతి పండగ పది రోజులు ఒక్కొక్కరిగా ఇంటి బాట పడుతుంటారు. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, కోల్కత్తా వంటి ప్రధాన నగరాల నుంచి తమ సొంత కార్లలో ఊర్లకు తరలివస్తుంటారు.

అమలాపురంలో చక్కర్లు కొట్టిన రోల్స్ రాయిస్ కారు.. పటాకులతో అల్లుడికి ఘన స్వాగతం
Rolls Royce Car
Follow us on

సంక్రాంతి అంటేనే ఆంధ్ర.. ఇది కేవలం మూడు రోజుల పండగ కాదు.. ఏకంగా ఓ పది రోజుల పాటు సాగే సందడి.. ఎక్కడెక్కడో స్థిరపడి ఉన్నవాళ్లంతా సంక్రాంతి పండగక్కి తప్పక సొంతూళ్లకు చేరకుంటారు. కోడిపందాలు, పిండివంటలు, హరివిల్లుని తలపించే రంగుల ముగ్గులు, గొబ్బెలు, హరిదాసులు, కొత్త అల్లులతో సంక్రాంతి పండగ హడావుడి, ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు స్థానికులు. ఇక కోనసీమలో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది…ఊరికి దూరంగా ఉంటూ ఉద్యోగాలు, వ్యాపారాలతో తీరిక లేకుండా గడిపే కోనసీమ వాసులు ఈ సంక్రాంతి పండగ పది రోజులు ఒక్కొక్కరిగా ఇంటి బాట పడుతుంటారు. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, కోల్కత్తా వంటి ప్రధాన నగరాల నుంచి తమ సొంత కార్లలో ఊర్లకు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో కొత్త కొత్త లగ్జరీ కార్లు కోనసీమ ప్రధాన పట్టణం అమలాపురం తో పాటు చుట్టుపక్కల పల్లెల్లో దర్శనమిస్తుంటాయి. ఈ క్రమంలోనే రూ.12 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ కారు అమలాపురంలో చక్కర్లు కొట్టి సందడి చేసింది.

చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత ఆదిత్య రామ్ కుటుంబం ఈ కారులో తమ అత్తవారి ఊరు మురమళ్ళకు వచ్చారు.. ఈ క్రమంలోనే వారు షాపింగ్ కోసం అమలాపురం రావడంతో ఆయన అభిమానులు, స్నేహితులు కలిసి బాణాసంచా కాల్చి పూలమాలలతో స్వాగతం పలికారు. ఈ కారును చూసేందుకు జనం ఎగబడటంతో ట్రాఫిక్ జామ్ అయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..