విమానాలు గాల్లో ప్రయాణిస్తున్నాయి. రోడ్లపై వాహనాలు వెళ్తాయనే విషయం మనకు తెలిసిందే. చిన్న పిల్లలను అడిగినా ఇదే విషయాన్న చెప్తారు. కానీ ఓ చోట గాల్లో వెళ్లాల్సిన విమానం రోడ్డుపైకి దూసుకొచ్చింది. అంతే కాదండోయ్.. అండర్ పాస్ నుంచి వెళ్లలేక ఇరుక్కుపోయింది.. ఆగండాగండి.. మీ డౌట్ మాకు అర్థమైంది. అసలు విమానం రోడ్డు పైకి రావడం ఏమిటి.. అండర్ పాస్ లో ఇరుక్కుపోవడం ఏమిటనేగా.. దీనికి ఓ పెద్ద కథే ఉందండోయ్.. అదేంటంటే.. హైదరాబాద్‌కు చెందిన పిస్తా హౌస్ ఓ పాత విమానాన్ని కొనుగోలు చేసింది. దానిని హోటల్‌గా మార్చాలనుకుంది. కొచ్చిన్ నుంచి ట్రాలీ లారీపై హైదరాబాద్ తీసుకొస్తుండగా బాపట్ల జిల్లాలోని ఓ అండర్ పాస్ వద్ద ఇరుక్కుపోయింది. పాత విమానాన్ని హోటల్‌గా మార్చాలనే ఉద్దేశంతో పిస్తాహౌస్ దీనిని కొనుగోలు చేసింది. ఈ క్రమంలో దీనిని హైదరాబాద్ తరలిస్తుండగా నవంబరు 12 రాత్రి మేదరమెట్ల బైపాస్‌లోని అండర్ పాస్ వద్ద ట్రాలీ ఇరుక్కుపోయింది.
మేదరమెట్ల వద్ద కొండరాళ్లను తొలగించే పనులు ప్రారంభం అయ్యాయి. దీంతో హైదరాబాద్ వైపునకు వెళ్లే రోడ్డును మూసివేశారు. అటువైపు వెళ్లే వాహనాలను ఫ్లై ఓవర్ మీదుగా కొరిశపాడు అండర్ పాస్ నుంచి దారి మళ్లిస్తున్నారు. ఈ క్రమంలో విమానాన్ని తరలిస్తున్న లారీ అండర్‌పాస్ నుంచి వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే అండర్ పాస్ ఎత్తు తక్కువగా ఉండటంతో మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో విమానానికి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తగా దానిని అండర్ పాస్ నుంచి బయటకు తెచ్చే ప్రయత్నాలు చేపట్టారు.
అండర్ పాస్ లో ఇరుక్కున్న విమానాన్ని స్థానికులు, వాహనదారులు ఆసక్తిగా తిలకించారు. గాల్లో ఎగరాల్సిన విమానం అండర్ పాస్ ఇరుక్కుపోవడం పై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..