Andhra Pradesh: దేశంలోనే రెండో అతిపెద్ద మట్టి వినాయకుడి నిమజ్జనం.. భారీగా తరలివచ్చిన భక్తజనం..

|

Sep 10, 2022 | 9:22 PM

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహలను ప్రతిటిష్టించాలని జరుగుతున్న ప్రయత్నం నెమ్మదిగా కార్యాచరణలోకి వస్తుంది. గతంలో ప్లాస్టర్ ఆఫ్ ఫారీస్ తో చేసిన భారీ విగ్రహాలను ప్రతిష్టించేవారు. వీటిని నదుల్లో..

Andhra Pradesh: దేశంలోనే రెండో అతిపెద్ద మట్టి వినాయకుడి నిమజ్జనం.. భారీగా తరలివచ్చిన భక్తజనం..
Lord Ganesh Kurnool
Follow us on

Andhra Pradesh: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహలను ప్రతిటిష్టించాలని జరుగుతున్న ప్రయత్నం నెమ్మదిగా కార్యాచరణలోకి వస్తుంది. గతంలో ప్లాస్టర్ ఆఫ్ ఫారీస్ తో చేసిన భారీ విగ్రహాలను ప్రతిష్టించేవారు. వీటిని నదుల్లో నిమజ్జనం చేయడం ద్వారా రంగులు నీటిలో కాలుసి, నీరు కలుషితం అయ్యేది. దీంతో మట్టి విగ్రహాలను వినియోగించాలని ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కొన్నేళ్లుగా ఓ ప్రయత్నాన్ని ప్రారంభించాయి. మొత్తం మీద నెమ్మదిగా భారీ ప్లాస్టర్ ఆఫ్ ఫారీస్ విగ్రహాల స్థానంలో మట్టి విగ్రహాలను వినియోగించడం మొదలుపెట్టారు. అయితే మట్టివిగ్రహాలను కూడా భారీ స్థాయిలో పెట్టాలనే ఆలోచనతో మట్టితో ఎత్తైన విగ్రహాలను తయారుచేయించి ఈఏడాది చాలా చోట్ల ప్రతిష్టించారు. దీనిలో భాగంగా కర్నూలులో దేశంలోనే రెండవ అతిపెద్ద మట్టి వినాయకుడిని ప్రతిష్టించారు. ఈరోజు దేశంలోనే రెండవ అతిపెద్ద మట్టి వినాయకుడి నిమజ్జనం జరిగింది. కర్నూలులో తుంగభద్ర నది వద్దన జరిగిన ఈకార్యక్రమానికి భక్తజనం భారీగా తరలివచ్చారు. ఈవిగ్రహం ఎత్తు 55 అడుగులు. ఈ భారీ మట్టి వినాయకుడిని వేలాదిమంది భక్తులు నిమజ్జనం చేశారు. వాస్తవంగా ఈనెల 8న కర్నూలులో వినాయక నిమజ్జనం జరిగింది. అయితే 55 అడుగుల భారీ మట్టి వినాయకుడిని సెప్టెంబర్ 10వ తేదీ శనివారం నిమజ్జనం చేశారు.

రెండు నెలలపాటు బీహార్ రాజస్థాన్ నుంచి వచ్చిన కార్మికులు తుంగభద్రా నది ఒడ్డున ఈవిగ్రహన్ని తయారు చేశారు. ఆతర్వాత అక్కడే ప్రతిష్టించారు. ప్రతిష్టించిన చోటనే ఫైర్ ఇంజన్ల ద్వారా నీటిని కొట్టి మట్టి వినాయకుడు కరిగిపోయేలా చేసి నిమజ్జనం చేశారు. తుంగభద్రా నది పక్కనే ఉండటంతో నీరు మట్టి అంతా నదిలో కలిసిపోయింది. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు నగరవాసులు వేలాదిగా తరలివచ్చారు. కర్నూలు ఎమ్మెల్యే ఆఫీస్ ఖాన్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, బిజెపి నేత హరీష్ బాబు, జనసేన నేత రేఖ గౌడ్ తదితర నేతలు పార్టీలకు అతీతంగా పాల్గొని నిమజ్జనం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..