Breaking News
  • ఆదిలాబాద్‌: నేటి నుంచి నాగోబా జాతర. ఇంద్రవెళ్లి మండలం కేస్లాపూర్‌లో ప్రారంభంకానున్న జాతర. జాతరకు రానున్న తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల ఆదివాసీలు, గిరిజనులు.
  • అవినీతి సూచిలో భారత్‌కు 80వ స్థానం. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై వ్యాపారవర్గాలు నుంచి.. వివరాలు సేకరించిన ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్థ. అవినీతి కట్టడిలో తొలిస్థానంలో నిలిచిన డెన్మార్క్‌, న్యూజిలాండ్‌.
  • వలసల నియంత్రణకు ట్రంప్‌ సర్కార్‌ మరో కీలక చర్య. అమెరికా వచ్చే విదేశీ గర్భిణులపై ఆంక్షలు విధింపు. కాన్పు కోసమే అమెరికా వచ్చేవారికి పర్యాటక వీసా నిరాకరణ.
  • రోహింగ్యాల ఊచకోతపై అంతర్జాతీయ న్యాయస్థానం సంచలన తీర్పు. మయన్మార్‌లో రోహింగ్యాల నరమేధం జరిగింది. సైన్యం అండతో రోహింగ్యాలను ఊచకోత కోశారన్న న్యాయస్థానం. రోహింగ్యాలను రక్షించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశం.
  • కరోనా వైరస్‌కు కారణం పాములే. చైనా అధ్యయనంలో వెల్లడి. ఐదు నగరాలకు రాకపోకలన్నీ నిలిపివేసిన చైనా. వుహాన్‌, హుయాంగ్‌గాంగ్‌, ఎఝౌ, ఝిజియాంగ్‌.. ఖియాన్‌జింగ్‌ నగరాలపై రవాణా ఆంక్షలు విధింపు.

వైరల్ వీడియో: ప్రదీప్‌కి ఏమైంది..! అతని బ్రేక్‌పై రవి ఏమన్నాడంటే..?

Anchor Ravi reveals Sensational facts of Pradeep Machiraju, వైరల్ వీడియో: ప్రదీప్‌కి ఏమైంది..! అతని బ్రేక్‌పై రవి ఏమన్నాడంటే..?

యాంకర్‌గా ప్రదీప్‌కి.. బుల్లితెరపై స్పెషల్ ప్లేస్ ఉంది. ప్రదీప్‌ అంటే.. మామూలు ఫ్యాన్స్ ఫాలోయింగ్ లేదు. ఇప్పుడు అతనికి సంబంధించిన ఓ వార్త అందరినీ బాధ పెడుతోంది. అతని మాటలకు.. ఆటలకు.. ఫ్యాన్స్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు అభిమానులు. ప్రత్యేకంగా.. ప్రదీప్‌ అంటే.. ఫిమేల్ ఫ్యాన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక ప్రదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడు.. జోక్స్‌ వేసి.. ఇతర యాంకర్‌లను ఇట్టే ఇరుకున పెట్టేస్తాడు. అలాంటి ప్రదీప్ గత కొన్ని రోజుల నుంచి ఏ టీవీ షోలోనూ కనిపించడం లేదు. మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తోన్న ‘ఢీ’ షోలో కూడా కనిపించడం లేదు. అతని ప్లేస్‌లో.. రవి ఎంట్రీ ఇచ్చాడు. ఇలా ఉన్నట్లుండి అతను కనిపించకపోవడానికి కారణం ఏంటనేది జనాలకు అర్థం కాలేదు.

ప్రదీప్ ఎక్కువ రెమ్యునరేషన్ అడిగాడని.. అందుకే అతన్ని దూరం పెట్టారనే టాక్స్ వినిపించాయి. కానీ.. అసలు కారణం అది కాదని.. ప్రదీప్‌కి అనారోగ్యం కారణంగానే.. షోలకు దూరంగా ఉన్నాడని.. తాజాగా.. యాంకర్ రవి లీక్‌ చేసిన వీడియోలో తెలిసింది. ప్రస్తుతం ఈ వీడియో.. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని బయటకు రానీయకుండా.. కూడా చూసుకున్నాడు ప్రదీప్. కానీ.. రవి కారణంగా అది బయటకొచ్చింది.

ఈ నెల 23న యాంకర్ ప్రదీప్ బర్త్‌డే సందర్భంగా.. విష్‌ చేస్తూ.. రవి ఫేస్‌బుక్‌లో లైవ్ ఇచ్చాడు. ప్రదీప్‌కి ఫోన్ చేసి విష్ చేశానని.. అంతేకాదు.. అతడు రికవర్ అవుతున్నాడని.. త్వరలోనే మళ్లీ బుల్లితెరపై రీ ఎంట్రీ ఇస్తాడని.. అంటున్నాడు. దీన్ని బట్టి చూస్తుంటే.. ప్రదీప్ మొత్తానికి అనారోగ్యంతో బాధ పడుతున్నాడని అర్థమవుతోంది. అయితే.. అదేంటనేది మాత్రం తెలియడం లేదు. అనారోగ్యం నుంచి కోలుకున్నాక మళ్లీ ప్రదీప్.. బుల్లితెరపై రచ్చ చేస్తాడని.. రవి చెప్పుకొచ్చాడు. ఏమైనా.. ఇది ప్రదీప్ ఫ్యాన్స్‌కి చేధు వార్తనే చెప్పాలి.