ప్రణబ్ దాదా కాంగ్రెస్ మనిషా ? కాషాయధారా..?

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. మళ్ళీ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్షాలూ ఈసీపై విమర్శలు కురిపిస్తున్న వేళ..బీజేపీ కనుసన్నుల్లో ఎన్నికల కమిషన్ పని చేస్తోందని ఆరోపిస్తున్న వేళ.. ప్రణబ్ దాదా వాయిస్ మాత్రం ఇందుకు భిన్నంగా పలికింది. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగినందుకు ఈసీకి కితాబిచ్చారాయన. అంతటితో ఆగలేదు. కేవలం పనికి వెనుకాడేవాడే తన పరికరాలకు దూరంగా ఉంటాడని, వాటితో ‘ పోట్లాడతాడని ‘.. అయితే సమర్థుడైన […]

ప్రణబ్ దాదా కాంగ్రెస్ మనిషా ? కాషాయధారా..?
Follow us

|

Updated on: May 21, 2019 | 4:01 PM

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. మళ్ళీ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్షాలూ ఈసీపై విమర్శలు కురిపిస్తున్న వేళ..బీజేపీ కనుసన్నుల్లో ఎన్నికల కమిషన్ పని చేస్తోందని ఆరోపిస్తున్న వేళ.. ప్రణబ్ దాదా వాయిస్ మాత్రం ఇందుకు భిన్నంగా పలికింది. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగినందుకు ఈసీకి కితాబిచ్చారాయన. అంతటితో ఆగలేదు. కేవలం పనికి వెనుకాడేవాడే తన పరికరాలకు దూరంగా ఉంటాడని, వాటితో ‘ పోట్లాడతాడని ‘.. అయితే సమర్థుడైన వాడికి వాటిని ఎలా వినియోగించుకోవాలో తెలుసునని వ్యాఖ్యానించారు.  కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తో బాటు అన్నివిపక్షాలూ ఈసీని తూర్పారబట్టేందుకు ఒక్కటైన సమయంలో ప్రణబ్ ముఖర్జీ ఇలా వింతగా మాట్లాడడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ పార్టీలు ఆయన తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. బీజేపీ మాత్రం ఆయన వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మలచుకుంది. ఈ పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉంది గనుక ఇది సహజం. ఇక-ప్రణబ్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి చూస్తే..పక్కా కాంగ్రెస్ వాదిఅయిన ఈయన.. ‘ ది కొయలిషన్ ఇయర్స్-
1996-2012 ‘ అనే పుస్తకాన్ని రాశారు. దేశంలో 1996 నుంచి అప్పటివరకు ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వాల గురించి ఈ పుస్తకంలో వివరించారు. మొదటినుంచీ..తాను పదవి నుంచి దిగే వరకూ కాంగ్రెస్ పక్షపాతిగా ఉన్న ప్రణబ్,,2018 మే, జూన్  నెలల్లో తన చర్య ద్వారా పతాక వార్తలకెక్కారు. ముఖ్యంగా జూన్ లో నాగ్ పూర్ లో సంఘ్ పరివార్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొనడం ఆర్ ఎస్ ఎస్ మౌత్ పీస్ కి వరం.ఆ ఈవెంట్ లో పాల్గొనాలన్న ఆయన నిర్ణయాన్ని పునః పరిశీలించుకోవలసిందిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నో సార్లు కోరింది. అసలు ఈ సస్పెన్స్ కొన్ని  రోజులపాటు కొనసాగింది కూడా.. ఆ కార్యక్రమంలో పాల్గొనాలన్న ఆయన నిర్ణయాన్ని అప్పటి కేంద్ర బీజేపీ మంత్రి ఒకరు స్వాగతించారు.  ఆర్ ఎస్ ఎస్ పాకిస్తాన్ గానీ, ఐఎస్ఎస్ గానీ కాదన్నారు. కాగా-ప్రణబ్ చర్య..కాంగ్రెస్-సంఘ్ పరివార్ మధ్య టగ్ ఆఫ్ వార్ కి దారి తీసింది. ఆ ఈవెంట్ లో ప్రణబ్ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకపడ్డారు.
‘ ఆ పార్టీ పోకడ ఈ సెక్యులర్ దేశంలో బిర్యానీ ఎలా వండాలో ఈ దేశానికి నేర్పేందుకు మైనారిటీ మొఘలులు వచ్చినట్టు ఉందని, అలాగే బేక్ కేక్ ఎలా తయారు చేయాలో నేర్పడానికి బ్రిటిషర్లు వచ్చినట్టు ఆ పార్టీ వైఖరిని బట్టి తెలుస్తోందని ‘ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించిన ఆర్ ఎస్ ఎస్.. అయితే ప్రణబ్ ముఖర్జీ తన ప్రసంగంలో ఇందిరా గాంధీ, లేదా రాజీవ్ గాంధీ, లేక సోనియా గురించి గానీ, అదీగాక కాంగ్రెస్ పార్టీ గురించి గానీ పేర్కొనకుండా ‘ కప్పదాటు ‘ వేశారని ఈ సంస్థ నిర్వాహకుడొకరు ఇన్-డైరెక్ట్ గా విమర్శించారు. ఇక-ప్రణబ్ ముఖర్జీ బీజేపీకి దగ్గరవుతునన్నారన్న  సందేహాలను అనేకమంది వెలిబుచ్చారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రణబ్ ఇలా సందేహాలను లేవనెత్తేలా  భిన్న పోకడలు ప్రదర్శించడం విశ్లేషకులకు అంతుబట్టని విషయం.