అతడికి అదృష్టం 20 సార్లు తలుపు తట్టింది..!

|

Sep 09, 2020 | 12:09 PM

అదృష్టం పదే పదే తలుపు తట్టదనేది తప్పు.. అదృష్టం ఉండాలే కానీ ఎన్నిసార్లయినా తడుతూనే ఉంటుంది.. నక్కతోకను తొక్కిన ప్రతీసారి లక్కు కలిసేవస్తుంది.. ఏం… నమ్మకం లేదా? అయితే టోనీ మైల్స్‌ను అడిగి చూడండి.. ఆయనెవరని అంటారా? అమెరికాలోని వర్జీనియాలో ఉంటాడు టోనీ మైల్స్‌.. ఆయన ఓ 20 వర్జీనియా లాటరీ టికెట్లు కొన్నాడు.. అందులో ఏదో ఒక్క టికెట్‌కైనా లాటరీ తగలకపోదా అన్న ఆశ! ఓ నాలుగు రోజుల తర్వాత రిజల్ట్స్‌ వచ్చాయి.. 1-9-2-9 నంబర్ల […]

అతడికి అదృష్టం 20 సార్లు తలుపు తట్టింది..!
Follow us on

అదృష్టం పదే పదే తలుపు తట్టదనేది తప్పు.. అదృష్టం ఉండాలే కానీ ఎన్నిసార్లయినా తడుతూనే ఉంటుంది.. నక్కతోకను తొక్కిన ప్రతీసారి లక్కు కలిసేవస్తుంది.. ఏం… నమ్మకం లేదా? అయితే టోనీ మైల్స్‌ను అడిగి చూడండి.. ఆయనెవరని అంటారా? అమెరికాలోని వర్జీనియాలో ఉంటాడు టోనీ మైల్స్‌.. ఆయన ఓ 20 వర్జీనియా లాటరీ టికెట్లు కొన్నాడు.. అందులో ఏదో ఒక్క టికెట్‌కైనా లాటరీ తగలకపోదా అన్న ఆశ! ఓ నాలుగు రోజుల తర్వాత రిజల్ట్స్‌ వచ్చాయి.. 1-9-2-9 నంబర్ల కాంబినేషన్‌కు లాటరీ తగిలింది… విచిత్రమో.. అతడి లక్కో తెలియదు కానీ కొన్న 20 టికెట్లలోనూ ఆ కాంబినేషన్‌ నంబర్లు ఉన్నాయి.. ఒక్కో టికెట్‌కు అయిదు వేల డాలర్ల ప్రైజ్‌ మనీ .. అంటే ఇంచుమించుగా మూడున్నర లక్షల రూపాయలన్నమాట.. అలా 20 లాటరీ టికెట్లకు నగదు బహుమతి వచ్చేసింది అతడికి! అన్నీ కలుపుకుంటే 73 లక్షల 24 వేల రూపాయలు అతడి చేతికి అందాయి.. ఒక్కసారే అన్ని లాటరీలు తగిలేసరికి ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాడు టోనీ మైల్స్‌.. వచ్చిన డబ్బుతో ఉన్న అప్పులన్నీ తీర్చేద్దామని డిసైడ్‌ అయ్యాడు.. లాటరీలో వచ్చిన అమౌంట్ చిన్న మొత్తమే కానీ, కొన్ని అన్ని లాటరీ టికెట్లకు ప్రైజ్‌ రావడం మాత్రం పెద్ద విషయమే! ఎంతైనా సుడి ఉన్నడే సుమీ!