మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం.. కార్మికులతో వెళ్తున్న రెండు బస్సులు ఢీ.. 16మంది మృతి, 14మందికి గాయాలు

ఉత్తర మెక్సికో స‌రిహ‌ద్దు రాష్ట్రం సోనోరాలో మంగ‌ళ‌వారం ఉద‌యం ఘోర రోడ్డుప్రమాదం సంభ‌వించింది. ఈ ప్రమాదంలో 16 మంది సిబ్బంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, మ‌రో 14 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం.. కార్మికులతో వెళ్తున్న రెండు బస్సులు ఢీ.. 16మంది మృతి, 14మందికి గాయాలు
Buses Crash In Northern Mexico

Updated on: Apr 07, 2021 | 9:44 AM

US road accident: ఉత్తర మెక్సికో స‌రిహ‌ద్దు రాష్ట్రం సోనోరాలో మంగ‌ళ‌వారం ఉద‌యం ఘోర రోడ్డుప్రమాదం సంభ‌వించింది. గ‌ని కార్మికుల‌తో వెళ్తున్న రెండు బ‌స్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 16 మంది సిబ్బంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, మ‌రో 14 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. బాధితులంతా నోచే బ్యూనా గ‌నికి చెందిన వార‌ని పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో రెండు వాహ‌నాలు పూర్తిగా ధ్వంస‌మ‌య్యాయి. మృతులంతా మెక్సికో ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. గాయపడ్డ క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాద ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also..  మరోసారి బెంబేలెత్తిస్తున్న కరోనా మహమ్మారి.. సెకండ్ వేవ్‌తో షేక్ అవుతున్న జనం.. అప్రమత్తమైన కేంద్రం..!

Loading...
Unable to load recommendations.
Follow Us