Joe Biden Cancels Trump’s Nomination : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో షాక్ ఇచ్చారు ప్రెసిడెంట్ జో బైడెన్. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలని ఒక్కోటి రద్దు చేస్తోన్న తాజాగా తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. అమెరికాలోని కొలంబియా జిల్లా కోర్టు న్యాయమూర్తిగా భారతీయ అమెరికన్ విజయ్ శంకర్ నియామకంపై అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయ్ శంకర్‌ను జడ్జీగా నియమించాలన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన నామినేషన్‌ను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు.
శ్వేతసౌథం తాజాగా ఈ ప్రకటించింది. వాషింగ్టన్లో కార్యకలాపాలు నిర్వహించే కొలంబియా కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌కు విజయ్ శంకర్‌ను జడ్జీగా నియమించాలని.. గతేదాడి జూన్‌లో సెనేట్‌కు ప్రతిపాదించారు మాజీ ప్రెసిడెంట్ ట్రంప్. అయితే ఆ నామినేషన్‌ను సెనేట్ ఆమోదించలేదు.
ఇప్పటివరకు ట్రంప్ దాఖలు చేసిన 32 నామినేషన్లను ప్రెసిడెంట్ బైడెన్ రద్దు చేశారు. వీటిలో 17 జడ్జీ నియామకాలకు సంబంధించి ఉండటం విశేషం. ట్రంప్ నామినేట్ చేసిన సమయానికి విజయ్ శంకర్ న్యాయశాఖలోని పునర్విచారణ విభాగానికి డిప్యూటీ చీఫ్‌గా బాధ్యలు నిర్వహిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Czech Woman Marry Gujranwala : ఔను.. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు.. ఆమెకు 65.. ఆయనకు 23..
Share Market News Today : స్టాక్ మార్కెట్లో బడ్జెట్ ర్యాలీ.. ఐదవ రోజు కొనసాగిన బుల్ జోష్..