Covid Vaccine: అమెరికా ఆర్మీ సంచలన నిర్ణయం.. కోవిడ్‌ టీకా తీసుకోని 3,300 మంది సైనికులను తొలగించాలని నిర్ణయం..!

|

Feb 03, 2022 | 1:38 PM

US Army: గత రెండేళ్ల నుంచి వ్యాపిస్తున్న కరోనా.. తగ్గుముఖం పట్టినట్లే పట్టి థర్డ్‌ వేవ్‌ రూపంలో విజృంభిస్తోంది. ఒక వైపు కరోనాతో సతమతమవుతుంటే.. మరోవైపు కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి.

Covid Vaccine: అమెరికా ఆర్మీ సంచలన నిర్ణయం.. కోవిడ్‌ టీకా తీసుకోని 3,300 మంది సైనికులను తొలగించాలని నిర్ణయం..!
Us Army
Follow us on

US Army: గత రెండేళ్ల నుంచి వ్యాపిస్తున్న కరోనా.. తగ్గుముఖం పట్టినట్లే పట్టి థర్డ్‌ వేవ్‌ రూపంలో విజృంభిస్తోంది. ఒక వైపు కరోనాతో సతమతమవుతుంటే.. మరోవైపు కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. కొత్తగా వెలుగు చూసిన ఒమిక్రాన్‌ కేసులు కూడా క్రమ క్రమంగా పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా జోరుగా కొనసాగుతోంది. కరోనా నుంచి రక్షించుకునేందుకు వ్యాక్సిన్‌ ప్రతి ఒక్కరు తీసుకునేలా దేశాలు చర్యలు చేపడుతున్నాయి. ఇక అమెరికాలో మొదటి నుంచి కేసుల సంఖ్య విపరీతంగానే ఉంటుంది. అలాగే కొవిడ్ వ్యాక్సిన్ విషయంలో అమెరికా ఆర్మీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. కొవిడ్ టీకాలను తిరస్కరించిన 3,300 మంది అమెరికన్ సైనికులను వారి ఉద్యోగాల నుంచి తొలగించాలని యునైటెడ్ స్టేట్స్ (USA) ఆర్మీ నిర్ణయించింది. అమెరికా మెరైన్ కార్ప్స్, వైమానిక దళం, నేవీ దళాల్లో కొవిడ్ వ్యాక్సిన్ తిరస్కరించిన వారిని డిశ్చార్జ్ చేయాలని అమెరికన్ ఆర్మీ నిర్ణయించింది. గత వారం అమెరికన్ ఆర్మీ విడుదల చేసిన సమాచారం ప్రకారం 3,300 మందికి పైగా సైనికులు వ్యాక్సిన్ (Covid Vaccine) పొందడానికి నిరాకరించారు. వ్యాక్సిన్ ను తిరస్కరించిన వారిని అధికారికంగా రాతపూర్వకంగా మందలించారు. టీకాలు వేయించుకోని వారిని డిశ్చార్జ్ చేయనున్నట్లు ఆర్మీ వెల్లడించింది.

పెంటగాన్ యాక్టివ్-డ్యూటీ, నేషనల్ గార్డ్, రిజర్వ్‌ల సేవ సభ్యులందరూ కరోనా వ్యాక్సిన్‌ పొందాలని ఆర్మీ ఆదేశించింది. కరోనా పరిస్థితుల్లో వ్యాక్సిన్‌ తీసుకోవడం ఎంతో ముఖ్యమని, టీకాలు తీసుకోవడంలో ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేయరాదని తెలిపింది. అయితే అమెరికాలో ఒకవైపు ఒమైక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతుండగా, 3వేల మందికంటే ఎక్కువగా సైనికులు కొవిడ్ టీకాను తిరస్కరించారు. అమెరికా సైనికుల్లో 97 శాతం మంది ఒక్క డోసు వ్యాక్సిన్ మాత్రమే తీసుకున్నారు. ఇలా వ్యాక్సిన్‌ విషయంలో సైనికులు నిర్లక్ష్యం చేసినట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

కాగా, కరోనా మహమ్మారి అమెరికాపై ఎలా విజృంభించిందో అందరరికి తెలిసిందే. ఈ వైరస్‌ అమెరికాను అతలాకుతలం చేసింది. ప్రభుత్వాన్ని సైతం కంటిమీద కునుకు లేకుండా చేసింది. కరోనా కట్టడికి అమెరికా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. కరోనా కట్టడికి శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమించి టీకాను అందుబాటులోకి తీసుకువచ్చారు. కరోనా నుంచి రక్షించుకునేందుకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసి అధికంగా టీకాలు వేసి అమెరికా ప్రభుత్వం.

Also Read:

Watch Video: మాస్కులు ధరించి తుపాకులతో వచ్చారు.. రూ. కోటి ఎత్తుకెళ్లారు.. పట్టపగలే దొంగల బీభత్సం .. వీడియో

Winter Olympics: వింటర్ ఒలింపిక్స్‌లో కరోనా కలకలం.. ప్రారంభానికి ఒకరోజు ముందు భారీగా కేసులు నమోదు..!