ట్రంప్ రిసార్ట్‌.. కాల్పుల మోత, ఒకరు మృతి

|

May 14, 2019 | 11:06 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌‌ట్రంప్‌కు చెందిన ఓ రిసార్టు సమీపంలో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఫ్లోరిడాలోని సన్నీ‌ఐల్స్‌‌ బీచ్‌లో ట్రంప్‌ ఇంటర్నేషనల్‌ బీచ్‌ రిసార్టు వుంది. ఈనెల 12న అంటే.. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటన్నర సమయంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. తూటాలు పలు వాహనాలకు తగిలాయి. ఈ క్రమంలో తలకు గాయమైన 43 ఏళ్ల మహమ్మద్‌ జ్రాదీ […]

ట్రంప్ రిసార్ట్‌.. కాల్పుల మోత, ఒకరు మృతి
Follow us on

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌‌ట్రంప్‌కు చెందిన ఓ రిసార్టు సమీపంలో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఫ్లోరిడాలోని సన్నీ‌ఐల్స్‌‌ బీచ్‌లో ట్రంప్‌ ఇంటర్నేషనల్‌ బీచ్‌ రిసార్టు వుంది. ఈనెల 12న అంటే.. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటన్నర సమయంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. తూటాలు పలు వాహనాలకు తగిలాయి. ఈ క్రమంలో తలకు గాయమైన 43 ఏళ్ల మహమ్మద్‌ జ్రాదీ స్పాట్‌లో మృతి చెందాడు. మరో వాహనంలో గాయపడిన 19 ఏళ్ల యువతి ఆసుపత్రికి తరలించారు. మరో ఐదేళ్ల బాలుడికి కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. కొంతమంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు తుపాకి విష సంస్కృతికి అడ్డాగా మారింది అమెరికా. ఎక్కడపడితే అక్కడ తుపాకి బహిరంగంగా లభించడం ఈ తరహా ఘటనలకు కారణంగా చెబుతున్నారు. ఇప్పుడేకాదు.. కొద్దిరోజులుగా అక్కడి స్కూల్, యూనివర్సిటీలో జరిగిన కాల్పుల్లో పదుల సంఖ్యలు స్టూడెంట్స్ మరణించిన విషయాన్ని గుర్తు చేశారు.