కాంట్రవర్సీలకే కేరాఫ్ అడ్రస్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అంతేకాదు. చిత్ర విచిత్ర హావ భావాలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. తాజాగా మరో సంచలనానికి తెరతీశారు. కండలవీరుడి అవతారమెత్తారు. రాకీ బాల్బోవా బాడీకి తన తలను ఫోటో షాప్ ద్వారా అతికించి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
80వ దశకంలో హాలీవుడ్ దిగ్గజ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్ నటించిన రాకీ 3 మూవీలోని రాకీ బాల్బోవా పోస్టర్‌ను మార్ఫింగ్ చేసి తన తలను అతికించి పోస్ట్ చేశారు. కండలు తిరిగినబాడీతో ఛాంపియన్ బెల్ట్ ధరించి బిగబట్టిన పిడికిలితో బాక్సింక్‌కు రెడీగా ఉన్నట్లుగా ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. దీనిపై భిన్నమైన ట్వీట్స్ వెల్లువెత్తుతున్నాయి. థాంక్స్ గివింగ్ నేపథ్యంలోపోరాటానికి రెడీ అయ్యారని కొంతమంది ట్వీట్ చేయగా..మరికొందరు డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉన్న నాన్సీ పెలోసీతో బాక్సింగ్ రింగ్‌లో పోటీ పడుతున్నట్లు పోస్ట్ చేశారు. ఐతేఇటీవల ట్రంప్ అనారోగ్యంగా ఉన్నారంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టేందుకే ఈ ఫొటో పోస్ట్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.
— Donald J. Trump (@realDonaldTrump) November 27, 2019