కరోనా వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ను కలిగించే తీరును గుర్తించి సైంటిస్టులు

మానవ కణాల్లోకి కరోనా వైరస్‌.. ప్రవేశించి, ఇన్‌ఫెక్షన్‌ను కలిగించే తీరును కళ్లకు కట్టే ఒక బుల్లి సాధనాన్ని అమెరికా శాస్త్రవేత్తలు రూపొందించారు.

కరోనా వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ను కలిగించే తీరును గుర్తించి సైంటిస్టులు
Follow us

|

Updated on: Sep 23, 2020 | 11:28 AM

కరోనా వైరస్ మానవళిని కుదేపేపేస్తోంది. మందు లేని రోగానికి జనం విలవిలలాడుతున్నారు. మనిషికీ ఏరూపంలో ఎక్కడి నుంచి అంటుతుందో తెలియని పరిస్థితి. మానవ కణాల్లోకి కరోనా వైరస్‌.. ప్రవేశించి, ఇన్‌ఫెక్షన్‌ను కలిగించే తీరును కళ్లకు కట్టే ఒక బుల్లి సాధనాన్ని అమెరికా శాస్త్రవేత్తలు రూపొందించారు. అమెరికాలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్సింగ్‌ ట్రాన్స్‌లేషనల్‌ సైన్సెస్‌ (ఎన్‌సీఏటీఎస్‌) శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. కరోనా వైరస్‌పై కొమ్ము ఆకృతిలో స్పైక్‌ ప్రొటీన్లు ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు. మానవ కణంలోని ఏసీఈ2 అనే భాగానికి అతుక్కొని, ఆ తర్వాత కణంలోకి ప్రవేశించి ఇన్‌ఫెక్షన్‌ను కలిగించడానికి వైరస్‌కు ఇవి సాయపడుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించామని తెలిపారు. ఈ ప్రక్రియ మొత్తాన్నీ పరిశీలించడానికి శాస్త్రవేత్తలు క్వాంటమ్‌ డాట్‌ అనే ఫ్లోరోసెంట్‌ నానో రేణువును రూపొందించారు. పరిశోధనల కోసం వాస్తవ వైరస్‌ను ఉపయోగించడం చాలా కష్టమని.. అందుకు ప్రత్యేక మౌలిక వసతులు అవసరమని సైంటిస్టులు తెలిపారు. క్వాంటమ్‌ డాట్‌తో ఈ ఇబ్బంది తొలగిపోతుంది. మానవ కణానికి అతుక్కోవడం నుంచి అందులోకి చొరబడటం వరకూ.. వైరస్‌ చేసే అనేక పనులను ఇది నిర్వహిస్తుంది. పైగా ఈ సాధనానికి వెలుగులీనే సామర్థ్యం ఉన్నందువల్ల వాటి తీరుతెన్నులను మైక్రోస్కోపు కింద శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చని తెలియజేశారు. మరిన్ని పరిశోధనల ద్వారా వైరస్ కదలికలను కూడా గుర్తించాల్సి ఉందన్నారు శాస్త్రవేత్తలు. త్వరలో వైరస్ కదలికలను కట్టడి చేసేందుకు అమెరికా శాస్త్రవేత్తలు కొత్త ఓ మందును తయారీ చేసే పనిలో పడట్లు సమాచారం.

Latest Articles
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక