స్టీరింగ్‌ పట్టుకున్న శునకం..రివర్స్‌లో హైవేను దాటేసిన కారు

|

Nov 27, 2019 | 12:49 PM

అగ్రరాజ్యం అమెరికాలో శునకాలు తాము ఎందులోనూ తీసిపోమంటున్నాయి..మనుషులకు తాము ఏ మాత్రం తక్కువ కాదంటున్నాయి. మీరేనా డ్రైవ్‌ చేసేది..మేము కూడా చేస్తామంటూ స్టీరింగ్‌ పట్టుకుంటున్నాయి. నిన్న ఫ్లోరిడాలో ఓ శునకం రివర్స్‌లో సర్కిల్స్‌ వేసి యజమానిని, పోలీసులను గందరగోళానికి గురి చేసింది. ఈ ఘటన మరువకముందే..తాజాగా లూసియానాలో ఓ కుక్క డ్రైవింగ్‌ సీట్‌లో కూర్చొని రివర్స్‌లో కారును డ్రైవ్‌ చేసి నాలుగు లైన్ల హైవేను దాటేసింది. కారులో తమ పెంపుడుకుక్కతో పాటు వచ్చిన ఓ జంట పెట్రోల్‌ […]

స్టీరింగ్‌ పట్టుకున్న శునకం..రివర్స్‌లో హైవేను దాటేసిన కారు
Follow us on

అగ్రరాజ్యం అమెరికాలో శునకాలు తాము ఎందులోనూ తీసిపోమంటున్నాయి..మనుషులకు తాము ఏ మాత్రం తక్కువ కాదంటున్నాయి. మీరేనా డ్రైవ్‌ చేసేది..మేము కూడా చేస్తామంటూ స్టీరింగ్‌ పట్టుకుంటున్నాయి. నిన్న ఫ్లోరిడాలో ఓ శునకం రివర్స్‌లో సర్కిల్స్‌ వేసి యజమానిని, పోలీసులను గందరగోళానికి గురి చేసింది. ఈ ఘటన మరువకముందే..తాజాగా లూసియానాలో ఓ కుక్క డ్రైవింగ్‌ సీట్‌లో కూర్చొని రివర్స్‌లో కారును డ్రైవ్‌ చేసి నాలుగు లైన్ల హైవేను దాటేసింది.

కారులో తమ పెంపుడుకుక్కతో పాటు వచ్చిన ఓ జంట పెట్రోల్‌ బంక్‌ వద్ద గ్యాస్‌ నింపుకునేందుకు కిందకు దిగారు. వారు దిగడమే తరువాయి పెంపుడు కుక్క  చివావా..రయ్‌మని కారునురివర్స్‌ చేసేని నాలుగు లైన్ల హైవేను దాటేసింది. దీంతో ఆందోళనకు గురైన యజమాని కారు వెనక పరిగెత్తుతూ డోర్‌ ఓపెన్‌ చేయడానికి ప్రయత్నించి కింద పడిపోయింది. ఈ ఘటనలోఆమెకు స్వల్పగాయాలయ్యాయి.  దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను స్లిడెల్‌ పోలీసులు ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది.