కరోనా చికిత్సపై పరిశోధన.. రూ. 18 లక్షలు గెలుచుకున్న తెలుగమ్మాయి..
కరోనా చికిత్స విధానాన్ని కనుగొని 14 ఏళ్ల తెలుగు అమ్మాయి అనికా చేబ్రోలు 25 వేల డాలర్ల(రూ. 18.33 లక్షలు)ను గెలుచుకుంది.
Anika Chebrolu 3D Young Scientist Challenge: కరోనా చికిత్స విధానాన్ని కనుగొని 14 ఏళ్ల తెలుగు అమ్మాయి అనికా చేబ్రోలు 25 వేల డాలర్ల(రూ. 18.33 లక్షలు)ను గెలుచుకుంది. అమెరికాలోని టెక్సాస్‌లో నిర్వహించిన 3ఎం యంగ్ సైంటిస్ట్ ఛాలెంజ్‌లో కోవిడ్‌ను క్యూర్ చేసే శక్తివంతమైన మందును అనికా కనుగొంది. ఇన్-సిలికో మెథడాలజీ ద్వారా సార్స్-కోవ్-2 ప్రోటీన్‌ను కట్టడి చేసే అణువును అనికా కనిపెట్టింది.
ఇక ఆమె కనిపెట్టిన విధానాన్ని కోవిడ్‌కు శక్తివంతమైన చికిత్సగా భావించి ఆమెను విజేతగా ప్రకటించింది. డాక్టర్ మహ్ఫూజా అలీ సాయంతో తాను ఈ పరిశోధనను పూర్తి చేసినట్లు అనికా వెల్లడించింది. కాగా గతేడాది తీవ్రమైన జ్వరంతో బాధపడిన అనికా.. సీజనల్ ఫ్లూకు మందు కనుక్కోవాలని భావించింది. అయితే కోవిడ్ కల్లోలం ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురి చేస్తుండటంతో తన దృష్టి కరోనా వైపు మళ్లించి.. దాని నిర్మూలనపై దృష్టి పెట్టింది.
Congratulations to Anika Chebrolu, America’s Top #YoungScientist of 2020! Learn more about her winning 3M @DiscoveryEd Young Scientist Challenge invention: https://t.co/Vgn7jgUO6Z ??? pic.twitter.com/uJ6bDKu0GI
— 3M (@3M) October 13, 2020