అమెరికా సుప్రీంకోర్టు జడ్జిగా అమీ కోనీ బారెట్ ?

| Edited By: Anil kumar poka

Sep 22, 2020 | 2:42 PM

అమెరికా సుప్రీంకోర్టు జడ్జి రూథ్ బేడర్ గిన్స్ బెర్గ్ ఇటీవల మరణించడంతో ఆమె స్థానే కొత్త జడ్జిని నియమించేందుకు అధ్యక్షుడు ట్రంప్ కసరత్తు ప్రారంభించారు. ఈ పదవిలో మళ్ళీ మహిళనే నియమిస్తానని ప్రకటించిన ఆయన..

అమెరికా సుప్రీంకోర్టు జడ్జిగా అమీ కోనీ బారెట్ ?
Follow us on

అమెరికా సుప్రీంకోర్టు జడ్జి రూథ్ బేడర్ గిన్స్ బెర్గ్ ఇటీవల మరణించడంతో ఆమె స్థానే కొత్త జడ్జిని నియమించేందుకు అధ్యక్షుడు ట్రంప్ కసరత్తు ప్రారంభించారు. ఈ పదవిలో మళ్ళీ మహిళనే నియమిస్తానని ప్రకటించిన ఆయన..గురు. లేదా  శుక్రవారం ఈ పదవికి ఒకరిని నామినేట్ చేస్తానని పేర్కొన్నారు. ఈ క్రమంలో ట్రంప్ టాప్ చాయిస్ గా, ఫ్రంట్ రన్నర్ గా  సెవెంత్ సర్క్యూట్ కోర్టు జడ్జి అమీ కోనీ బారెట్ నిలిచింది.  ఈమె నిన్న వైట్ హౌస్ లో ట్రంప్ తో కొద్దిసేపు సమావేశమయింది. ఇక రెండో ‘రన్నర్’ గా యుఎస్ అప్పీల్స్ కోర్టులో జడ్జిగా వ్యవహరిస్తున్న బార్బరా లాగోవా నిలిచారు. ఈమె కూడా రేపో మాపో ట్రంప్ తో సమావేశమయ్యే అవకాశం ఉంది.