బన్నీ 20వ మూవీ ప్రారంభం.. ఆ రూమర్లకు చెక్ పడ్డట్లేనా..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 20వ మూవీ ప్రారంభం అయ్యింది. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ 20వ చిత్రంలో నటిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా ఈ ప్రాజెక్ట్‌ను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించనుంది. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరగగా.. దీనికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, దర్శకులు కొరటాల శివ, సురేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే దర్శకుడు సుకుమార్, బన్నీ, సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌లు […]

బన్నీ 20వ మూవీ ప్రారంభం.. ఆ రూమర్లకు చెక్ పడ్డట్లేనా..!
Follow us

| Edited By:

Updated on: Oct 30, 2019 | 3:16 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 20వ మూవీ ప్రారంభం అయ్యింది. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ 20వ చిత్రంలో నటిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా ఈ ప్రాజెక్ట్‌ను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించనుంది. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరగగా.. దీనికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, దర్శకులు కొరటాల శివ, సురేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే దర్శకుడు సుకుమార్, బన్నీ, సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ మూవీలో విజయ్ సేతుపతి విలన్‌గా నటించబోతున్నాడని వార్తలు రాగా.. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు.

కాగా చిత్తూరు జిల్లాలోని ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. స్మగ్లింగ్ కార్యకలాపాలను దగ్గర ఉండి చూసే వ్యక్తిగా బన్నీ కనిపించనున్నాడని.. ఇంతవరకు చూడని లుక్‌లో కూడా అతడు అభిమానులకు దర్శనమివ్వనున్నాడని సమాచారం. ఇక ఇప్పటికే ఈ మూవీకి దాదాపుగా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కాగా.. అల వైకుంఠపురంలో షూటింగ్‌ పూర్తికాగానే బన్నీ ఈ మూవీ చిత్రీకరణలో పాల్గొనబోతున్నాడు.

అయితే ఈ ఏడాది మొదట్లోనే బన్నీ-సుకుమార్‌ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చింది. కానీ ఆ తరువాత దీనిపై పలు పుకార్లు వినిపించాయి. ఈ మూవీ స్క్రిప్ట్‌తో బన్నీ అంతగా తృప్తి చెందలేదని.. సుకుమార్‌తో నటించేందుకు అల్లు అర్జున్ అంత ఆసక్తిని చూపడం లేదని వార్తలు వినిపించాయి.  మరోవైపు ఇటీవల టాప్ దర్శకులందరూ సంగీత దర్శకుడు దేవీ శ్రీని పక్కనపెడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సుకుమార్ కూడా బన్నీ మూవీకి దేవీని పక్కనపెడుతున్నాడని వార్తలు గుప్పుమన్నాయి. దానికి తోడు అల్లు అర్జున్ కూడా దేవీపై అంత ఆసక్తిని చూపడం లేదని కామెంట్లు వినిపించాయి. అయితే ఆ వార్తలన్నింటికీ చెక్ పెడుతూ సుకుమార్-బన్నీ మూవీ ప్రారంభం అవ్వడం.. దేవీ ఈ మూవీ ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరిగాయి. దీంతో ఈ రూమర్లకు చెక్ పడ్డట్లే అని స్పష్టంగా అర్థమవుతోంది.

కాగా బన్నీ, సుకుమార్ కాంబినేషన్లో ఇది వరకు ఆర్య, ఆర్య 2 తెరకెక్కాయి. వీటిలో ఆర్య పెద్ద విజయాన్ని అందుకోగా.. ఆర్య 2 యావరేజ్‌గా నిలిచింది. కానీ ఈ కాంబోకు మాత్రం టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో వీరి కాంబోలో ఇప్పుడు హ్యాట్రిక్ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు మొదలయ్యాయి.