చైనా వస్తువుల్ని బహిష్కరించాలంటూ వీహెచ్పీ, భజరంగ్‌ దళ్ ప్రచారం..

గాల్వన్‌ లోయలో భారత్‌-చైనా జవాన్ల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ గురించి తెలిసిందే. ఈ ఘటన చోటుచేసుకున్నప్పటి నుంచి దేశంలో చైనాపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో పెరుగుతోంది. అంతేకాదు..

చైనా వస్తువుల్ని బహిష్కరించాలంటూ వీహెచ్పీ, భజరంగ్‌ దళ్ ప్రచారం..
Follow us

| Edited By:

Updated on: Jun 21, 2020 | 2:01 PM

గాల్వన్‌ లోయలో భారత్‌-చైనా జవాన్ల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ గురించి తెలిసిందే. ఈ ఘటన చోటుచేసుకున్నప్పటి నుంచి దేశంలో చైనాపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో పెరుగుతోంది. అంతేకాదు.. చైనా వస్తువుల్ని బహిష్కరించాలంటూ నిరసన కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. బాయ్‌కాట్‌ మేడ్ ఇన్ చైనా అంటూ స్లోగన్స్‌ ఇస్తూ.. కొన్ని వ్యాపార మార్కట్లు కూడా అడుగు ముందుకు వేశాయి. పలు స్వచ్ఛంద సంస్థలు కూడా చైనా వస్తువుల్ని బహిష్కరించాలంటూ ఆందోనళ చేపడుతున్నారు. ఈ క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగర్‌లో విశ్వ హిందూ పరిషత్‌, భజరంగ్‌ దళ్ ఆధ్వర్యంలో చైనా వస్తువుల్ని బహిష్కరించాలంటూ ఇంటింటి ప్రచారం చేపట్టారు. అంతేకాదు.. చైనాకు చెందిన పలువస్తువుల్ని పగలకొట్టి నిరసన తెలిపారు.

కాగా, సోమవారం నాడు రాత్రి సమయంలో డ్రాగన్‌ కంట్రీ భారత జవాన్లపై ఇనుప చువ్వలున్న రాడ్లతో దాడికి తెగబడింది. ఈ ఘటనలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. వీరిలో కల్నల్‌ కూడా ఉన్నారు. మరోవైపు చైనా సైనికులు కూడా 30 మంది మరణించినట్లు ఆ దేశం ప్రకటించింది.

Latest Articles