ఎంఐఎంకు ‘మహా’ విక్టరీ.. కమలానికి షాకిచ్చిన ‘కైట్’

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ సత్తా చాటింది. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇస్తూ.. ఓట్లు చీల్చిన మజ్లీస్ పార్టీ.. రెండు నియోజకవర్గాల్లో విజయం సాధించింది. మలేగాన్ సెంట్రల్‌ నుంచి ఎంఐఎం తరఫున పోటీ చేసిన మహమ్మద్ ఇస్మాయిల్ అబ్దుల్ ఖతీక్.. కాంగ్రెస్ అభ్యర్థిపై 38,519ఓట్లతో గెలుపొందారు. అలాగే ధూలే సిటీ నుంచి షా ఫరూక్ అన్వర్.. ఇండిపెండెంట్ అభ్యర్థిపై విజయం సాధించారు. అయితే మహారాష్ట్రలో మొదట […]

ఎంఐఎంకు 'మహా' విక్టరీ.. కమలానికి షాకిచ్చిన 'కైట్'
Follow us

| Edited By:

Updated on: Oct 25, 2019 | 1:00 PM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ సత్తా చాటింది. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇస్తూ.. ఓట్లు చీల్చిన మజ్లీస్ పార్టీ.. రెండు నియోజకవర్గాల్లో విజయం సాధించింది. మలేగాన్ సెంట్రల్‌ నుంచి ఎంఐఎం తరఫున పోటీ చేసిన మహమ్మద్ ఇస్మాయిల్ అబ్దుల్ ఖతీక్.. కాంగ్రెస్ అభ్యర్థిపై 38,519ఓట్లతో గెలుపొందారు. అలాగే ధూలే సిటీ నుంచి షా ఫరూక్ అన్వర్.. ఇండిపెండెంట్ అభ్యర్థిపై విజయం సాధించారు. అయితే మహారాష్ట్రలో మొదట కార్పొరేటర్‌గా పలు స్థానాల్లో పోటీ చేసి గెలుపొందిన ఎంఐఎం.. ఇప్పుడు రెండు ఎమ్మెల్యే స్థానాలను సొంతం చేసుకోవడం విశేషం. కాగా తన పార్టీని జాతీయ పార్టీగా చేసే దిశగా అసుదుద్దీన్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్, బీజేపీలను టార్గెట్ చేసిన అసదుద్దీన్.. సైలెంట్‌గానే తన వ్యూహాలను అమలుపరుస్తున్నారు. ముఖ్యంగా ఈసారి మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లను చీల్చడంలో ఆయన సఫలం అయ్యారు. ఇదిలా ఉంటే మరోవైపు బీహార్‌లో కిషన్‌గంజ్ ఉప ఎన్నిక స్థానానికి ఎంఐఎం తరఫున పోటీ చేసిన కమ్రుల్ హుడా.. బీజేపీ అభ్యర్థిపై గెలుపొందడం విశేషం. ఏదేమైనా మొత్తానికి అటు కాంగ్రెస్‌కు, ఇటు బీజేపీకి గట్టి షాక్ ఇచ్చారు అసదుద్దీన్.