విశాఖ ఏజెన్సీలో వరద కష్టాలు

ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. అటు ఏపీలోని విశాఖలో పలు ప్రాంతాలు వర్షపు నీటితో మునిగిపోయాయి. వర్షం కారణంగా ఏజెన్సీలో జనజీవనం స్థంభించిపోయింది. లంబంగి ఘాట్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు రోడ్డు మీదికి వచ్చి పడటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని వాహనదారులు జంకుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలు పడినప్పడు ప్రయాణం చేయాలంటేనే గిరిజనవాసులు వణికిపోతున్నారు. మరోవైపు రోడ్ల పై చెట్లు విరిగిపడ్డాయి. అటు ఇటు వెళ్లడానికి లేకుండా రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో.. ఆర్టీసీ బస్సులు, […]

విశాఖ ఏజెన్సీలో వరద కష్టాలు
Follow us

| Edited By: Srinu

Updated on: Oct 07, 2019 | 1:37 PM

ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. అటు ఏపీలోని విశాఖలో పలు ప్రాంతాలు వర్షపు నీటితో మునిగిపోయాయి. వర్షం కారణంగా ఏజెన్సీలో జనజీవనం స్థంభించిపోయింది. లంబంగి ఘాట్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు రోడ్డు మీదికి వచ్చి పడటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని వాహనదారులు జంకుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలు పడినప్పడు ప్రయాణం చేయాలంటేనే గిరిజనవాసులు వణికిపోతున్నారు. మరోవైపు రోడ్ల పై చెట్లు విరిగిపడ్డాయి. అటు ఇటు వెళ్లడానికి లేకుండా రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో.. ఆర్టీసీ బస్సులు, వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రయాణికులే కిందికి దిగి చెట్లను పక్కకు తీసివేసే ప్రయత్నం చేశారు. సుమారు గంటపాటు రోడ్డు పైనే ఉండిపోయారు.

అదే సమయంలో లంబసింగి ఘాట్ రోడ్డు దిగువలో సమ్మగిరి వెళ్లే రహదారిపై కొండవాగుల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వరద ఉప్పొంగి ప్రవహించడంతో.. వంతెన మునిగిపోయింది. ఓడిశా, ఛత్తీస్ ఘఢ్, తెలంగాణకు వెళ్లే రహదారి కావడంతో నిత్యం వాహనాలతో రద్దీగా ఉంటుంది. వర్షాలు పడినప్పుడు మాత్రం రాకపోకలు నిలిచిపోతున్నాయి. మొత్తానికి విశాఖ మన్యాన్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రహదారులు కొట్టుకుపోవడంతో విశాఖ ఏజెన్సీలోని చాలా ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెలిపోయాయి.