ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ఉగ్రవాదుల ఘాతుకం.. అయిదుగురు మృతి

కరోనా మహమ్మారితో ప్రపంచం విలవిలాడుతుంటే .. అఫ్ఘనిస్తాన్ లో మాత్రం ఉగ్రవాదులు తమ హింసాత్మక దాడులను ఆపడంలేదు. ఒకవైపు తాలిబ‌న్‌తో శాంతి చ‌ర్చ‌లు జ‌రుగుతుండగానే.. ఈ దాడికి పాల్పడ్డారు. తాజాగా ఘంజి సిటీలో జ‌రిగిన కారు బాంబు దాడిలో అయిదుగురు మృతి చెందారు. 32 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. ఆఫ్ఘ‌నిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ నేష‌న‌ల్ డైర‌క్ట‌రేట్ సెక్యూరిటీ యూనిట్‌ను టార్గెట్ చేస్తూ దాడికి పాల్ప‌డ్డట్టు అక్కడి అధికారులు తెలిపారు. బాధితులంతా ఇంటెలిజెన్స్ సెక్యురిటీ విభాగానికి చెందిన ఉద్యోగులే. […]

ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ఉగ్రవాదుల ఘాతుకం.. అయిదుగురు మృతి
Follow us

|

Updated on: May 18, 2020 | 4:07 PM

కరోనా మహమ్మారితో ప్రపంచం విలవిలాడుతుంటే .. అఫ్ఘనిస్తాన్ లో మాత్రం ఉగ్రవాదులు తమ హింసాత్మక దాడులను ఆపడంలేదు. ఒకవైపు తాలిబ‌న్‌తో శాంతి చ‌ర్చ‌లు జ‌రుగుతుండగానే.. ఈ దాడికి పాల్పడ్డారు.

తాజాగా ఘంజి సిటీలో జ‌రిగిన కారు బాంబు దాడిలో అయిదుగురు మృతి చెందారు. 32 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. ఆఫ్ఘ‌నిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ నేష‌న‌ల్ డైర‌క్ట‌రేట్ సెక్యూరిటీ యూనిట్‌ను టార్గెట్ చేస్తూ దాడికి పాల్ప‌డ్డట్టు అక్కడి అధికారులు తెలిపారు. బాధితులంతా ఇంటెలిజెన్స్ సెక్యురిటీ విభాగానికి చెందిన ఉద్యోగులే. దాడికి బాధ్య‌త వ‌హిస్తూ ఎవ‌రూ ప్ర‌క‌ట‌న చేయనప్పటికీ తాలిబన్లలే ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు అధికారులు భావిస్తున్నారు. బాంబు దాడిలో గాయపడ్డ క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.