ఉద్ధవ్ సమక్షంలో శివసేనలోకి ఊర్మిళ.. చట్టసభకు ఎంపికైతే మహిళల సమస్యలపై పోరాడతానన్న నటి.

బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్ (46) శివసేన పార్టీలో చేరారు. మహారాష్ట్ర సీఎం, శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సమక్షంలో ఊర్మిళ పార్టీ కండువా కప్పుకున్నారు

ఉద్ధవ్ సమక్షంలో శివసేనలోకి ఊర్మిళ.. చట్టసభకు ఎంపికైతే మహిళల సమస్యలపై పోరాడతానన్న నటి.
Follow us

|

Updated on: Dec 02, 2020 | 7:04 AM

బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్ శివసేన పార్టీలో చేరారు. శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సమక్షంలో ఊర్మిళ పార్టీ కండువా కప్పుకున్నారు. ఊర్మిళ శివసేనలో చేరుతున్నారంటూ కొన్నిరోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె మంగళవారం శివసేన పార్టీలో చేరారు.

మాటోండ్కర్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేశారు. ముంబై ఉత్తర నియోజకవర్గం నుంచి ఆమె ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఓటమి తర్వాత ఆమె పార్టీ నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్‌లో చేరిన ఐదునెలల్లోనే పార్టీ తీరు నచ్చక ఊర్మిళ బయటకు వచ్చారని ఆమె సన్నిహితులు చెప్తున్నారు. కాంగ్రెస్ ను వీడడం పై ఆమె స్పందిస్తూ .. తాను వీడింది పార్టీనే కానీ ప్రజలను కాదని అన్నారు. ఊర్మిళను శాసనమండలికి పంపాలని శివసేన భావిస్తోందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ విషయం పై ఊర్మిళ స్పందిస్తూ.. తాను చట్టసభకు ఎంపికైతే మహిళల సమస్యలపై పోరాడతానని తెలిపారు. ఇక బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పైన ఊర్మిళ విమర్శలు చేసారు. కంగనాకు లేనిపోని ప్రాముఖ్యత కల్పించారని ఊర్మిళ అన్నారు.