రష్యాను వణికించిన భూకంపం..

ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వణికిస్తుంటే.. మరోవైపు ప్రకృతి భూకంపం రూపంలో పలుచోట్ల వణికిస్తోంది. ఇప్పటికే గ్రీస్, క్రోయేషియాలో గత వారం భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా.. ఇప్పుడు రష్యాలో భూకంపం సంభవించింది. దేశంలోని కురీల్ దీవుల్లో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. రిక్టార్ స్కేల్‌పై 7.5గా నమోదైంది. ఈ విషయాన్ని యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే స్పష్టం చేసింది. రష్యన్ పట్టనానికి 219 కిలో మీటర్ల దూరంలోని కురీల్ దీవుల్లో.. […]

రష్యాను వణికించిన భూకంపం..
Earthquake
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 25, 2020 | 3:19 PM

ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వణికిస్తుంటే.. మరోవైపు ప్రకృతి భూకంపం రూపంలో పలుచోట్ల వణికిస్తోంది. ఇప్పటికే గ్రీస్, క్రోయేషియాలో గత వారం భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా.. ఇప్పుడు రష్యాలో భూకంపం సంభవించింది. దేశంలోని కురీల్ దీవుల్లో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. రిక్టార్ స్కేల్‌పై 7.5గా నమోదైంది. ఈ విషయాన్ని యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే స్పష్టం చేసింది. రష్యన్ పట్టనానికి 219 కిలో మీటర్ల దూరంలోని కురీల్ దీవుల్లో.. 56.7 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని సైంటిస్టులు గుర్తించారు.